Telugu Global
NEWS

కాంగ్రెస్ నేతలకు ఠాగూర్ సీరియస్ వార్నింగ్

తెలంగాణ కాంగ్రెస్ నేత‌ల‌కు పార్టీ ఇంచార్జీ మాణిక్కం ఠాగూర్ ఫుల్లుగా క్లాస్ పీకారు. పార్టీలో క్ర‌మ‌శిక్ష‌ణ‌తో మెల‌గాల‌ని నేతలకు హిత‌బోధ చేశారు. పార్టీలో విభేదాలపై మీడియాకు ఎక్కి ర‌చ్చ చేయొద్దంటూ ఆయ‌న నేత‌ల‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బుధ‌వారం గాంధీ భ‌వ‌న్‌లో జ‌రిగిన పార్టీ చింత‌న్ శిబిర్ తొలి రోజు స‌మావేశంలో ఆయన మాట్లాడారు ఈ భేటీలో ప‌లు కీల‌క అంశాల‌పై వాడీవేడిగా చ‌ర్చ సాగ‌గా… ఏదైనా స‌మ‌స్య ఉంటే నాలుగు గోడ‌ల మ‌ధ్య చ‌ర్చించుకుని ప‌రిష్క‌రించుకోవాల‌ని […]

ఠాగూర్
X

తెలంగాణ కాంగ్రెస్ నేత‌ల‌కు పార్టీ ఇంచార్జీ మాణిక్కం ఠాగూర్ ఫుల్లుగా క్లాస్ పీకారు. పార్టీలో క్ర‌మ‌శిక్ష‌ణ‌తో మెల‌గాల‌ని నేతలకు హిత‌బోధ చేశారు. పార్టీలో విభేదాలపై మీడియాకు ఎక్కి ర‌చ్చ చేయొద్దంటూ ఆయ‌న నేత‌ల‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బుధ‌వారం గాంధీ భ‌వ‌న్‌లో జ‌రిగిన పార్టీ చింత‌న్ శిబిర్ తొలి రోజు స‌మావేశంలో ఆయన మాట్లాడారు

ఈ భేటీలో ప‌లు కీల‌క అంశాల‌పై వాడీవేడిగా చ‌ర్చ సాగ‌గా… ఏదైనా స‌మ‌స్య ఉంటే నాలుగు గోడ‌ల మ‌ధ్య చ‌ర్చించుకుని ప‌రిష్క‌రించుకోవాల‌ని మాణిక్కం ఠాగూర్ పార్టీ నేత‌ల‌కు సూచించారు. అంతే త‌ప్పించి మీడియాకు ఎక్కి ర‌చ్చ ర‌చ్చ చేయ‌రాద‌ని ఆయ‌న వార్నింగ్ ఇచ్చారు. చ‌ర్చించుకున్నా స‌మ‌స్య ప‌రిష్కారం కాక‌పోతేనే… స‌మ‌స్య ఏదైనా త‌న దృష్టికి తీసుకురావాల‌ని సూచించారు. ఈ త‌ర‌హా వ్య‌వ‌హారాల‌కు సంబంధించి పార్టీలో అందరూ సెట్ అయ్యారని, ఇంకా ఇద్ద‌రు, ముగ్గురు మాత్రం సెట్ కావాల్సి ఉందని ఠాగూర్ అన్నారు

First Published:  2 Jun 2022 2:17 AM IST
Next Story