Telugu Global
MOVIE UPDATES

మరో మైలురాయి అందుకున్న కేజీఎఫ్ 2

యష్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్ ఛాప్టర్ 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్టయింది. విడుదలైన ప్రతి సెంటర్ లో ఈ సినిమాకు అపూర్వ ఆదరణ దక్కింది. అలా ఇండియాలోనే బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన ఈ సినిమా, తాజాగా మరో మైలురాయి అందుకుంది. సక్సెస్ ఫుల్ గా 50 రోజుల రన్ పూర్తి చేసుకుంది ఈ సినిమా. ఇండియాలో 390కి పైగా సెంటర్లలో ఇంకా కేజీఎఫ్-2 ను ప్రదర్శిస్తున్నారు. అటు ఓవర్సీస్ […]

KGF 2
X

యష్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్ ఛాప్టర్ 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్టయింది. విడుదలైన ప్రతి సెంటర్ లో ఈ సినిమాకు అపూర్వ ఆదరణ దక్కింది. అలా ఇండియాలోనే బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన ఈ సినిమా, తాజాగా మరో మైలురాయి అందుకుంది. సక్సెస్ ఫుల్ గా 50 రోజుల రన్ పూర్తి చేసుకుంది ఈ సినిమా.

ఇండియాలో 390కి పైగా సెంటర్లలో ఇంకా కేజీఎఫ్-2 ను ప్రదర్శిస్తున్నారు. అటు ఓవర్సీస్ లో పదికి పైగా థియేటర్లలో ఈ సినిమా ఇంకా కొనసాగుతోంది. విడుదలై 50 రోజులైనా ఇప్పటికీ ఈ సినిమా థియేటర్లలో రన్ అవ్వడం ఓ పెద్ద రికార్డ్. ఎందుకంటే, పెద్ద పెద్ద సినిమాలే విడుదలైన 2 వారాలకు దుకాణం సర్దేస్తున్నాయి. అలాంటిది కేజీఎఫ్ 2 ఇంకా రన్ అవుతుండడం చెప్పుకోదగ్గ విశేషం

ఈ సినిమాకు సంబంధించి మరో విశేషం కూడా చెప్పుకోవాలి. ఈ మూవీని ఆల్రెడీ ఓటీటీలో పెట్టేసింది అమెజాన్ ప్రైమ్ సంస్థ. పెయిడ్ వ్యూయింగ్ విధానంలో ఈ సినిమాను అందుబాటులోకి తెచ్చింది. ఓవైపు స్ట్రీమింగ్ లో ఉన్నప్పటికీ, మరోవైపు థియేటర్లలో ఈ సినిమా కొనసాగుతుండడం చాలా గొప్ప విషయం.

యష్ ను ఈ సినిమా పాన్ ఇండియా స్టార్ ను చేసింది. అటు ప్రశాంత్ నీల్ కూడా ఈ సినిమాతో ఇండియన్ డైరక్టర్స్ జాబితాలోకి చేరిపోయాడు. ఛాప్టర్-2లో నటించిన బాలీవుడ్ తారలు సంజయ్ దత్, రవీనా టాండన్ మరోసారి ఫేమ్ లోకి వచ్చారు. బాలీవుడ్ లో ఇప్పుడు వాళ్లకు కొత్త ఇమేజ్ వచ్చింది. ఈ సినిమాతో వాళ్లు రీఎంట్రీ ఫీల్ అవుతున్నారు.

First Published:  2 Jun 2022 9:19 AM IST
Next Story