Telugu Global
International

నో వర్క్ ఫ్రం హోం…ఇకపై ఆఫీస్ కు రాకుంటే నో జాబ్

కరోనా మహమ్మారి తర్వాత అన్ని కంపెనీలు తమ ఉద్యోగస్తులకు వర్క్ ఫ్రం హోం ఇచ్చాయి. దాంతో రెండేళ్ళపాటు ఇంటి నుంచి పని చేయడానికి అలవాటు పడిన చాలా మంది ఆఫీస్ కు రావడానికి ఇష్టపడటం లేదు. కరోనా భయం తగ్గిపోయి కార్యాలయాలన్ని తెరిచుకొని కార్యకలాపాలు సాగిస్తున్నప్పటికీ ఆఫీస్ కు వచ్చే వారి శాతం చాలా తక్కువగా ఉంటోంది. అయితే ఈ విషయంపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కు కోపమొచ్చింది. తమ ఉద్యోగులందరూ ఆఫీస్ కు రావాల్సిందే […]

నో వర్క్ ఫ్రం హోం...ఇకపై ఆఫీస్ కు రాకుంటే నో జాబ్
X

కరోనా మహమ్మారి తర్వాత అన్ని కంపెనీలు తమ ఉద్యోగస్తులకు వర్క్ ఫ్రం హోం ఇచ్చాయి. దాంతో రెండేళ్ళపాటు ఇంటి నుంచి పని చేయడానికి అలవాటు పడిన చాలా మంది ఆఫీస్ కు రావడానికి ఇష్టపడటం లేదు. కరోనా భయం తగ్గిపోయి కార్యాలయాలన్ని తెరిచుకొని కార్యకలాపాలు సాగిస్తున్నప్పటికీ ఆఫీస్ కు వచ్చే వారి శాతం చాలా తక్కువగా ఉంటోంది.

అయితే ఈ విషయంపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కు కోపమొచ్చింది. తమ ఉద్యోగులందరూ ఆఫీస్ కు రావాల్సిందే అని అనేక సార్లు ఆదేశాలు జారీ చేసినా టెస్లా ఉద్యోగులు ఎవరూ వినడంలేదట. ఎలన్ మస్క్ స్వయంగా ఉద్యోగులకు అనేక సార్లు మెయిల్స్ చేశాడట. అయినా ఎవ్వరూ పట్టించుకోలేదు. దాంతో ఆగ్రహం నషాలానికి అంటిన ఎలన్ మస్క్ ఆఫీస్ కు రాకపోతే ఉద్యోగాలు పీకేస్తానని వార్నింగ్ ఇచ్చాడు.

”ఇకపై ఇంటి నుంచి పనిచేస్తామంటే కుదరదు, అది ఆమోదయోగ్యం కూడా కాదు.ఒకవేళ ఎవరైనా వర్క్ ఫ్రం హోం చేయాలని అనుకున్నా వారానికి 40 గంటలు కార్యాలయంలో ఉండాల్సిందే.అది కూడా కుదరదనుకుంటే కనుక భేషుగ్గా ఉద్యోగాన్ని వదులుకోవచ్చు.” అని ఉద్యోగులందరికీ మెయిల్స్ చేశాడు మస్క్. ఇప్పుడు ఎలన్ మస్క్ చేసిన ఈమెయిల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

First Published:  2 Jun 2022 3:23 AM IST
Next Story