Telugu Global
National

మావోయిస్ట్ లలో కలుస్తారా..? అయితే సైన్యంలోకి తోసేయండి..

మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కువగా యువత మావోయిస్ట్ కార్యకలాపాల వైపు ఆకర్షితులవ్వ‌డం సహజం. అయితే వారిని మావోయిస్ట్ లలో కలవకుండా అడ్డుకోవాలంటే మంచి ఉపాధి చూపించాలి. ఆయా ప్రాంతాలకు దూరంగా వారిని తీసుకెళ్లగలగాలి. కానీ సొంత ప్రాంతాన్ని, ఉన్న ఊరిని వదిలిపెట్టి రావడం గిరిజనులకు ఇష్టం ఉండదు. పోనీ, ఉద్యోగ అవకాశాలు కల్పిద్దామన్నా వారి చదువు అంతంత మాత్రమే. దీంతో కేంద్రం కొత్త ప్రణాళికను సిద్ధం చేసింది. 8వ తరగతి చదివినవారిని కూడా సీఆర్పీఎఫ్ పోలీసులుగా నియమిస్తోంది. […]

మావోయిస్ట్ లలో కలుస్తారా..? అయితే సైన్యంలోకి తోసేయండి..
X

మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కువగా యువత మావోయిస్ట్ కార్యకలాపాల వైపు ఆకర్షితులవ్వ‌డం సహజం. అయితే వారిని మావోయిస్ట్ లలో కలవకుండా అడ్డుకోవాలంటే మంచి ఉపాధి చూపించాలి. ఆయా ప్రాంతాలకు దూరంగా వారిని తీసుకెళ్లగలగాలి. కానీ సొంత ప్రాంతాన్ని, ఉన్న ఊరిని వదిలిపెట్టి రావడం గిరిజనులకు ఇష్టం ఉండదు. పోనీ, ఉద్యోగ అవకాశాలు కల్పిద్దామన్నా వారి చదువు అంతంత మాత్రమే. దీంతో కేంద్రం కొత్త ప్రణాళికను సిద్ధం చేసింది. 8వ తరగతి చదివినవారిని కూడా సీఆర్పీఎఫ్ పోలీసులుగా నియమిస్తోంది.

దేశవ్యాప్తంగా మావోయిస్ట్ కార్యకలాపాలు ఎక్కువగా కనిపిస్తున్న ప్రాంతం దండకారణ్యం. ఛ‌త్తీస్ ఘడ్, ఒడిశా, ఏపీ సరిహద్దుల్లోని కొన్ని ప్రాంతాల్లో మావోయిస్ట్ లు విస్తరించి ఉన్నారు. వీరిని దెబ్బకొట్టాలంటే.. అక్కడి అణువణువూ తెలిసిన వ్యక్తులు కావాలి. దీంతో కేంద్రం ఛ‌త్తీస్ ఘడ్ గిరిజన యువతను నిబంధనలు సడలించి మరీ సీఆర్పీఎఫ్ ఉద్యోగాలలోకి తీసుకుంటోంది. ఛ‌త్తీస్ ఘడ్ లోని బీజాపూర్, దంతెవాడ, సుక్మా జిల్లాల యువతకు మినహాయింపులిచ్చింది. సీఆర్పీఎఫ్ లో చేరేందుకు కనీస విద్యార్హతను 10వ తరగతి నుంచి 8వ తరగతికి తగ్గించింది. శారీక ప్రమాణాల విషయంలోనూ మినహాయింపులిచ్చింది. అయితే పదో తరగతి పాసయ్యే వరకు వీరు ప్రొబేషన్ పీరియడ్ లో ఉంటారు. ఉద్యోగంలో ఉంటూనే ప్రభుత్వ సాయంతో కోచింగ్ తీసుకుని పదో తరగతి పాసై ఆ తర్వాత రెగ్యులర్ అవుతారు.

ఒకే దెబ్బకు రెండు పిట్టలు..
ఆ మూడు జిల్లాల యువత మావోయిస్ట్ కార్యకలాపాల పట్ల ఆకర్షితులవకుండా చూసేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో వారికి ఉపాధి కల్పించడంతో.. వారి కుటుంబ సభ్యులు మావోయిస్ట్ సానుభూతి పరులుగా ఉండే అవకాశాన్ని దూరం చేస్తోంది. సహజంగా పోలీస్ ఫోర్స్, సైన్యంలో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వారికి ఎక్కువగా మినహాయింపులుంటాయి. ఇప్పుడు మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న గిరిజనులకు కూడా ప్రత్యేక మినహాయింపులిస్తోంది కేంద్రం.

First Published:  2 Jun 2022 7:28 AM IST
Next Story