Telugu Global
National

సామాన్యులకు కేంద్రం షాక్.. గ్యాస్ సబ్సిడీ ఎత్తివేత.. మార్కెట్ ధరకే సిలిండర్

పేద, మధ్యతరగతి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. డొమెస్టిక్ (గృహ అవసరాలు)కు ఉపయోగించే ఎల్పీజీ సిలిండర్‌పై ఇస్తున్న సబ్సిడీని ఎత్తేస్తూ నిర్ణయం తీసుకున్నది. ఇకపై సాధారణ ప్రజలు కూడా మార్కెట్ ధరకే గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేయాల్సి ఉన్నది. కేవలం ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ పొందిన వారికి మాత్రమే సబ్సిడీని పరిమితం చేసింది. ఈ విషయాన్ని గురువారం చమురు శాఖ కార్యదర్శి పంకజ్ జైన్ వెల్లడించారు. కోవిడ్ […]

central-government-has-decided-to-lift-the-subsidy-on-domestic-lpg-cylinders
X

పేద, మధ్యతరగతి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. డొమెస్టిక్ (గృహ అవసరాలు)కు ఉపయోగించే ఎల్పీజీ సిలిండర్‌పై ఇస్తున్న సబ్సిడీని ఎత్తేస్తూ నిర్ణయం తీసుకున్నది. ఇకపై సాధారణ ప్రజలు కూడా మార్కెట్ ధరకే గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేయాల్సి ఉన్నది. కేవలం ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ పొందిన వారికి మాత్రమే సబ్సిడీని పరిమితం చేసింది. ఈ విషయాన్ని గురువారం చమురు శాఖ కార్యదర్శి పంకజ్ జైన్ వెల్లడించారు.

కోవిడ్ ప్రారంభమైన నాటి నుంచి ఎల్పీజీ వినియోగదారులకు సబ్సిడీ ఇవ్వడం లేదు. కేవలం రూ. 40 రూపాయలు మాత్రమే బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఇకపై అది కూడా ఇవ్వరని కేంద్రం స్పష్టం చేసింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్లు ఉజ్వల పథకం లబ్దిదారులకు మాత్రం రూ. 200 సబ్సిడీ ఇవ్వనున్నారు. ఈ మేరకు వారి ఖాతాల్లో ఆయిల్ కంపెనీలు జమ చేయనున్నాయి. అయితే ఈ సబ్సిడీ ఏడాదికి 12 సిలిండర్లకు మాత్రమే పరిమితం కానున్నది.

దేశంలో ప్రస్తుతం 30.5 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు ఉండగా.. వాటిలో 9 కోట్ల మంది ఉజ్వల పథకం లబ్దిదారులు ఉన్నారు. మిగిలిన 21 కోట్ల మందికి సబ్సిడీ ఇకపై లభించదు. మరోవైపు 2010లో పెట్రోల్‌పై, 2014లో డీజిల్‌పై సబ్సిడీని తొలగించారు. 2016లో కిరోసిన్‌పై సబ్సిడీని తీసేయగా.. తాజాగా ఎల్పీజీపై కూడా ఎత్తేయడంతో ఇకపై సామాన్యులకు సబ్సిడీలు అందే అవకాశం లేకుండా పోయింది. ప్రస్తుతం ఢిల్లీ సిలిండర్ ధర రూ. 1003 ఉండగా.. హైదరాబాద్‌లో రూ. 1054గా ఉన్నది.

ALSO READ : అమిత్ షాను క్రీడాశాఖ మంత్రిని చేయండి

First Published:  2 Jun 2022 4:32 PM IST
Next Story