Telugu Global
National

మా మంత్రి వర్గాన్ని, ఎమ్మెల్యేలందరినీ ఒకే సారి అరెస్టు చేయండి -కేజ్రీవాల్ ఆక్రోశం

ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ అరెస్టు తర్వాత ఇక మరో మంత్రి మనీష్ సిసోడియాను కేంద్ర ప్రభుత్వం అరెస్టు చేయబోతుందా ? పక్కాగా అరెస్టు చేస్తారని ఢిల్లీ ముఖ్యమం త్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఇలా ఒకరి తర్వాత ఒకరిని అరెస్టు చేసే బదులు తమ అందరినీ ఒకే సారి అరెస్టు చేయాలని ఆయన కేంద్రాన్ని కోరారు. సత్యేందర్ జైన్ అరెస్టు గురించి కొన్ని నెలల క్రితమే తనకు తెలియజేసిన […]

మా మంత్రి వర్గాన్ని, ఎమ్మెల్యేలందరినీ ఒకే సారి అరెస్టు చేయండి -కేజ్రీవాల్ ఆక్రోశం
X

ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ అరెస్టు తర్వాత ఇక మరో మంత్రి మనీష్ సిసోడియాను కేంద్ర ప్రభుత్వం అరెస్టు చేయబోతుందా ? పక్కాగా అరెస్టు చేస్తారని ఢిల్లీ ముఖ్యమం త్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఇలా ఒకరి తర్వాత ఒకరిని అరెస్టు చేసే బదులు తమ అందరినీ ఒకే సారి అరెస్టు చేయాలని ఆయన కేంద్రాన్ని కోరారు.

సత్యేందర్ జైన్ అరెస్టు గురించి కొన్ని నెలల క్రితమే తనకు తెలియజేసిన వర్గాలు, రాబోయే రోజుల్లో మనీష్ సిసోడియాను కూడా కేంద్ర ప్రభుత్వం అరెస్టు చేస్తుందని తనకు చెప్పాయని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం చెప్పారు.

అన్ని ఏజెన్సీలు సిసోడియాపై కల్పిత కేసులు బనాయిస్తాయని ఆ వర్గాలు తెలిపాయని కేజ్రీవాల్ తెలిపారు. “సిసోడియా రాష్ట్రంలోని వేలాది మంది పిల్లలకు ఉజ్వల భవిష్యత్తును అందించారు. సత్యేందర్ జైన్, మనీష్ సిసోడియా వంటి వారిని తప్పుడు కేసుల్లో కటకటాల వెనక్కి నెట్టడం ద్వారా, వారు ఆరోగ్యం, విద్యా రంగాలలో చేస్తున్న మంచి పనిని ఆపాలని కోరుకుంటున్నారు” అని కేజ్రీవాల్ ఆరోపించారు.

“ప్రధానమంత్రికి నా విజ్ఞప్తి ఏమిటంటే, మమ్మల్ని ఒకరి తర్వాత మరొకరిని అరెస్టు చేసే బదులు, దయచేసి మా మంత్రులు, ఎమ్మెల్యేలందరినీ కలిపి ఒకే సారి జైలులో పెట్టండి. మీరు ఇలా ఒక్కొక్కరిని అరెస్టు చేయడం వల్ల‌ ప్రజల కోసం చేస్తున్న పనిని నెమ్మదిస్తుంది, ”అని కేజ్రీవాల్ విలేకరుల సమావేశంలో అన్నారు.

“ఈ అరెస్టుల వెనుక కారణం ఏమిటో మాకు తెలియదు, కానీ మేము దాని గురించి భయపడటం లేదు,” అన్నారాయన. “ఐదేళ్ల క్రితం కూడా, మీరు మా అందరిపై దాడులు చేయించారు, కానీ అప్పుడు మమ్మల్ని వదిలిపెట్టారు. ‘మోదీ నుంచి నిజాయితీ సర్టిఫికేకెట్ పొందామని అప్పుడు ప్రజలకు చెప్పుకున్నాం. ఇప్పుడు మళ్లీ అరెస్టుల కథ‌ మొదలైంది. దయచేసి మీరు ఇలాగే దాడులు చేయండి. మేము మరోసారి మీ నుండి అత్యంత నిజాయితీగల , దేశభక్తి పార్టీగా సర్టిఫికెట్ పొందుతామని నాకు నమ్మకం ఉంది.” అన్నారు కేజ్రీవాల్

First Published:  2 Jun 2022 6:45 AM IST
Next Story