Telugu Global
National

దళిత విద్యార్థి చేతులు విరగ్గొట్టిన అగ్రకుల ఉపాధ్యాయుడు

ఓ అగ్రకుల టీచర్ దళిత విద్యార్థిని విచక్షణారహితంగా కొట్టడంతో బాలుడి రెండు చేతులూ విరిగిపోయాయి. హర్యానాలోని జజ్జర్ జిల్లాలోని ప్రభుత్వ‌ గురుకుల పాఠశాలలో ఈ హృదయ విదారకమైన సంఘటన జరిగింది. బాధిత దళిత విద్యార్థి పేరు శుభమ్ కాగా అతనిపై దాడి చేసి చేతులు విరగ్గొట్టిన ఉపాధ్యాయుడి పేరు మహావీర్ శాస్త్రి. ఆ బాలుడు దళితుడు కావడంతో పోలీసులు కూడా అతనికి కనీస సహకారం అందించలేదు. ఈ విషయంపై మీడియా సమావేశంలో మాట్లాడిన శుభమ్ తల్లి రీతూ… శుభం తోటి […]

దళిత విద్యార్థి చేతులు విరగ్గొట్టిన అగ్రకుల ఉపాధ్యాయుడు
X

ఓ అగ్రకుల టీచర్ దళిత విద్యార్థిని విచక్షణారహితంగా కొట్టడంతో బాలుడి రెండు చేతులూ విరిగిపోయాయి. హర్యానాలోని జజ్జర్ జిల్లాలోని ప్రభుత్వ‌ గురుకుల పాఠశాలలో ఈ హృదయ విదారకమైన సంఘటన జరిగింది. బాధిత దళిత విద్యార్థి పేరు శుభమ్ కాగా అతనిపై దాడి చేసి చేతులు విరగ్గొట్టిన ఉపాధ్యాయుడి పేరు మహావీర్ శాస్త్రి. ఆ బాలుడు దళితుడు కావడంతో పోలీసులు కూడా అతనికి కనీస సహకారం అందించలేదు.

ఈ విషయంపై మీడియా సమావేశంలో మాట్లాడిన శుభమ్ తల్లి రీతూ… శుభం తోటి విద్యార్థి నుండి తనకు కాల్ వచ్చిందని, బాలుడిని కనికరం లేకుండా కొట్టారని , అతనికి తీవ్ర గాయాలు అయ్యాయని అతను చెప్పాడని ఆమె తెలిపింది.

“ఈ సంఘటన గురించి తెలిసిన వెంటనే, నేను మా పెద్ద కొడుకును పాఠశాలకు పంపాను.అతను పాఠశాల కు వెళ్ళే సరికి శుభం రెండు చేతులూ వేళ్ళాడుతూ ఉన్నాయి. శుభమ్‌ను తనతో తీసుకెళ్లమని నా పెద్ద కొడుకుకు ప్రిన్సిపాల్ చెప్పాడు. నా కొడుకు నొప్పితో చాలా బాస్ధపడ్డాడు. మరుసటి రోజు ఉదయం, నేను అతనిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాను, అక్కడ వైద్యులు ఎక్స్-రే పరీక్షలు నిర్వహించారు. రెండుచేతులు అనేక చోట్ల విరిగాయని డాక్టర్లు చెప్పారు. నేను స్థానిక పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించగా, శుభంను గురుకులంలో చేర్పించడం నా తప్పు అని అధికారులు అన్నారు. కేసు పెట్టడానికి నిరాకరించారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి నేను న్యాయవాదులను, అంబేద్కర్ మిషనరీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నుండి అమిత్ గ్రేవాల్‌ను సంప్రదించవలసి వచ్చింది, మెడికో లీగల్ సర్టిఫికేట్ కూడా ఇవ్వలేదు. ”అని ఆమె చెప్పింది

“ ఖరీదైన ప్రయివేటు విద్యను చదివించలేక నా కొడుకును గురుకులానికి పంపాను. చదువుకు మూల్యం ఎముకలు విరగడం అని నాకు తెలియదు. ”అని తల్లి అంది.

గురుకులానికి ప్రభుత్వం క్రమబద్దం గా నిధులు విడుదల చేస్తున్నప్పటికీ అధికారులు విద్యార్థులతో కూరగాయలు తీయించడం, గోధుమలను దంపించడం వంటి పనులు చేయిస్తారని శుభం కుటుంబం ఆరోపించింది.

గాయపడిన బాలుడి తరఫు న్యాయవాది స్నేహ మాట్లాడుతూ, మేము అనేక ప్రయత్నాలు చేస్తే గానీ పోలీసులు ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయలేదు అన్నారు.
ఉపాధ్యాయుడిపై రెండు చట్టాల ప్రకారం కాగ్నిజబుల్ నేరాల కింద కేసు నమోదు చేసినట్లు ఆమె తెలిపారు. “నిందితుడు రాజీ కోసం కుటుంబాన్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు.అందుకే మేము అతనిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నాము. JJ చట్టంలోని సెక్షన్ 82 ప్రకారం దేశంలో శారీరక దండన నిషేధించబడింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం బాధితుడికి న్యాయం జరగలేదు. తల్లికి ఎఫ్‌ఐఆర్‌ నిరాకరించారు. దీనిపై మేము పంజాబ్, హర్యానా హైకోర్టును ఆశ్రయించాలనుకుంటున్నాము. అని న్యాయవాది స్నేహ తెలిపారు.

మరో వైపు శుభం చేతులు విరిగిన సంఘటనపై స్పంధించడానికి గురుకుల హెడ్ విజయ్ పాల్ శాస్త్రి స్పందించలేదు.

First Published:  1 Jun 2022 8:05 AM IST
Next Story