Telugu Global
MOVIE UPDATES

ఆ సమయంలో నా పని అయిపోయిందన్నారు

సూపర్‌ స్టార్‌ కృష్ణ తన పుట్టిన రోజు సందర్బంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారు. ఆయన కుమార్తె మంజుల స్వయంగా ఇంటర్వ్యూ చేశారు. తన కేరీర్‌లో ఎదురైన అనుభవాలను కృష్ణ పంచుకున్నారు. అల్లూరి సీతారామరాజు సినిమాను చూసిన సినీ పెద్దలు.. ఇక ఈ సినిమా తర్వాత నీతో సినిమాలు తీస్తున్న వారంతా అయిపోయారంటూ వ్యాఖ్యానించారని గుర్తు చేసుకున్నారు. అల్లూరు సీతారామరాజు సినిమా తర్వాత ఎంతబాగా నటించినా ప్రజలకు అది పెద్దగా అనిపించదని.. తిరిగి హిట్‌ రావడానికి […]

ఆ సమయంలో నా పని అయిపోయిందన్నారు
X

సూపర్‌ స్టార్‌ కృష్ణ తన పుట్టిన రోజు సందర్బంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారు. ఆయన కుమార్తె మంజుల స్వయంగా ఇంటర్వ్యూ చేశారు. తన కేరీర్‌లో ఎదురైన అనుభవాలను కృష్ణ పంచుకున్నారు. అల్లూరి సీతారామరాజు సినిమాను చూసిన సినీ పెద్దలు.. ఇక ఈ సినిమా తర్వాత నీతో సినిమాలు తీస్తున్న వారంతా అయిపోయారంటూ వ్యాఖ్యానించారని గుర్తు చేసుకున్నారు. అల్లూరు సీతారామరాజు సినిమా తర్వాత ఎంతబాగా నటించినా ప్రజలకు అది పెద్దగా అనిపించదని.. తిరిగి హిట్‌ రావడానికి ఏడాది రెండేళ్లు పడుతుందని చెప్పారన్నారు.

అన్నట్టుగానే సీతారామరాజు సినిమా తర్వాత వరుసగా 12 సినిమాలు ప్లాప్‌ అయ్యాయని కృష్ణ వివరించారు. కృష్ణ పని అయిపోయిందంటూ తనను సినిమాల్లో బుక్ చేయడం కూడా మానేశారన్నారు. చివరకు తానే సొంతంగా పాడిపంటలు సినిమా తీశానని.. లైఫ్ అండ్ డెత్ సమస్యగా అనుకుని ఆ సినిమా కోసం పనిచేశామన్నారు. పాడిపంటలు సినిమా భారీ హిట్‌ అవడంతో.. కృష్ణ పని అయిపోయిందనుకున్న వారంతా ఆశ్చర్యపోయారన్నారు. ఆ తర్వాత తిరిగి వెనక్కు చూసుకోవాల్సిన అవసరం రాలేదన్నారు.

ఇంటర్వ్యూ చేసిన మంజుల తాను నటిగా వచ్చేందుకు చేసిన ప్రయత్నాలను ప్రస్తావించగా.. ఆ సమయంలో జరిగిన పరిణామాలను కృష్ణ సరదాగా గుర్తు చేసుకున్నారు. కనీసం ఆడిషన్ కూడా చేయకుండా బాలకృష్ణ పక్కన హీరోయిన్‌గా మంజులను.. కృష్ణారెడ్డి ఎంపిక చేశారని.. కానీ మంజులను సొంత చెల్లిగా భావించే అభిమానులు.. ఆమె హీరోయిన్‌గా నటించడానికి వీల్లేదంటూ పెద్ద గొడవ చేశారని, కృష్ణారెడ్డి బ్యానర్లను అభిమానులు చించేశారని చెప్పారు.

పద్మభూషణ్ అవార్డు కోసం తాను ఎలాంటి ప్రయత్నం చేయలేదని.. ఒకరోజు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి.. ఇంత కాలమైనా మీకు పద్మ అవార్డు రాకపోవడం ఏంటని ప్రశ్నించారని.. ఆ తర్వాత ఆయనే ఢిల్లీ వెళ్లి ప్రధాని మన్మోహన్ సింగ్ వద్ద జాబితాలో తనపేరు రాయించి వచ్చారన్నారు. అలా తాను ఇంట్లో ఉన్నా పద్మ అవార్డు వచ్చిందన్నారు కృష్ణ.

First Published:  31 May 2022 9:59 PM GMT
Next Story