Telugu Global
National

బంధువు కోసం 800 మంది ప్రయాణీకుల ప్రాణాలను ఫణంగా పెట్టిన రైలు డ్రైవర్

అహ్మదాబాద్‌ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఆశ్రమ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో డ్రైవర్ సీట్లో కూర్చున్న ఓ వ్యక్తి పరికరాలను ఇటు అటూ మారుస్తూ తానే రైలు నడుపుతున్నాను అని ఫేస్ బుక్ లో లైవ్ ఇచ్చాడు. అతను రైలు డ్రైవర్ కాదు అసలు రైల్వే ఉద్యోగే కాదు. ఆ లైవ్ చూసిన నెటిజనులు, రైల్వే అధికారులు ఆందోళన చెందారు. అసలేం జరిగింది ? అహ్మదాబాద్‌ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఆశ్రమ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు చీఫ్ లోకో ఇన్‌స్పెక్టర్ (డ్రైవర్) […]

rajasthan-train-driver-put-the-lives-of-800-passengers-at-stake-handed-over-the-engine-to-the-relative
X

అహ్మదాబాద్‌ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఆశ్రమ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో డ్రైవర్ సీట్లో కూర్చున్న ఓ వ్యక్తి పరికరాలను ఇటు అటూ మారుస్తూ తానే రైలు నడుపుతున్నాను అని ఫేస్ బుక్ లో లైవ్ ఇచ్చాడు. అతను రైలు డ్రైవర్ కాదు అసలు రైల్వే ఉద్యోగే కాదు. ఆ లైవ్ చూసిన నెటిజనులు, రైల్వే అధికారులు ఆందోళన చెందారు.

అసలేం జరిగింది ?

అహ్మదాబాద్‌ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఆశ్రమ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు చీఫ్ లోకో ఇన్‌స్పెక్టర్ (డ్రైవర్) సంతోష్ తన బంధువు సుఖరాం అనే వ్యక్తికి టికట్ కన్ఫర్మ్ కాకపోవడంతో అతన్ని తనతో పాటు ఇంజన్ క్యాబిన్ లో కూర్చోబెట్టుకున్నాడు. ఇంజన్ క్యాబిన్ లో వేరే వ్యక్తి ఎక్కడమే తప్పంటే ఇక సుఖరాం ఊరికే కూర్చోకుండా క్యాబిన్ నుండి ఫేస్‌బుక్ పేజీలో ప్రత్యక్ష ప్రసారం చేయడం ప్రారంభించాడు. రైలును తానే నడుపుతున్నాని లైవ్‌ చేశాడు. అతను రైలులో పరికరాలను కూడా ట్యాంపరింగ్ చేశాడు. ఆ సమయంలో రైలులో 800 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు.

దీనిపై స్పంధించిన అధికారులు జైపూర్ డివిజనల్ రైల్వే చీఫ్ లోకో ఇన్‌స్పెక్టర్ సంతోష్, లోకో పైలట్ ప్రదీప్ మీనా, అసిస్టెంట్ లోకో పైలట్ మనీష్‌లను తక్షణమే సస్పెండ్ చేశారు. సుఖ్ రామ్ పై కేసు నమోదు చేశారు.

దీనిపై జైపూర్ డివిజన్‌కు చెందిన డీఆర్‌ఎం నరేంద్ర మాట్లాడుతూ.. విచారణలో బండికూయ్‌-ఢిల్లీ స్టేషన్ల మధ్య ఇది జరిగినట్టు తేలిందని చెప్పారు. విచారణ కోసం ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఇలా ప్రయాణం చేయడం తప్పు. రైల్వే అధికారుల విచారణలో వెనుక లోకోలో సుఖ్‌రామ్ ఒంటరిగా కూర్చున్నట్లు వెలుగులోకి వచ్చింది.

వెనుక లోకో నుండి రైలు నడిపే అవకాశం లేదు. కానీ అక్కడి నుంచి ఎమర్జెన్సీ సిస్టమ్‌ను వినియోగించుకోవచ్చు. సుఖ్‌రామ్ వెనుక లోకోలో ఉన్న ఎమర్జెన్సీ సిస్టమ్‌ను ఉపయోగించినట్లయితే, పెను ప్రమాదం జరిగి ఉండేది. దీంతో వందలాది మంది ప్రయాణికుల భద్రత ప్రమాదంలో పడేది.

ALSO READ : రైల్వేలో డిటొనేటర్ల వాడకానికి త్వరలో స్వస్తి..

First Published:  1 Jun 2022 11:38 AM IST
Next Story