హిందీ సినిమాకు సమర్పకుడిగా రాజమౌళి
రాజమౌళి ఇప్పుడు టాలీవుడ్ దర్శకుడు కాదు. ఆయన ఇండియన్ డైరక్టర్. చాలామంది అతడితో అసోసియేట్ అవ్వాలని ప్రయత్నిస్తుంటారు. ఇందులో భాగంగా దర్శకనిర్మాత కరణ్ జోహార్ తొలి అడుగు వేశాడు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన బ్రహ్మాస్త్ర సినిమా సౌత్ వెర్షన్ కు సమర్పకుడిగా రాజమౌళిని తీసుకున్నారు. సౌత్ కు సంబంధించిన తొలి ప్రచార కార్యక్రమం వైజాగ్ లో జరిగింది. ఈ ఈవెంట్ లో మాట్లాడిన రాజమౌళి.. హీరో రణబీర్, హీరోయిన్ అలియాపై ప్రశంసలు కురిపించాడు. “4 సంవత్సరాల […]
రాజమౌళి ఇప్పుడు టాలీవుడ్ దర్శకుడు కాదు. ఆయన ఇండియన్ డైరక్టర్. చాలామంది అతడితో అసోసియేట్ అవ్వాలని ప్రయత్నిస్తుంటారు. ఇందులో భాగంగా దర్శకనిర్మాత కరణ్ జోహార్ తొలి అడుగు వేశాడు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన బ్రహ్మాస్త్ర సినిమా సౌత్ వెర్షన్ కు సమర్పకుడిగా రాజమౌళిని తీసుకున్నారు.
సౌత్ కు సంబంధించిన తొలి ప్రచార కార్యక్రమం వైజాగ్ లో జరిగింది. ఈ ఈవెంట్ లో మాట్లాడిన రాజమౌళి.. హీరో రణబీర్, హీరోయిన్ అలియాపై ప్రశంసలు కురిపించాడు.
“4 సంవత్సరాల క్రితం కరణ్ జోహార్ గారు ఫోన్ చేసి ఒక పెద్ద సినిమా చేయబోతున్నాను, మా డైరెక్టర్ అయాన్ ముఖర్జీ అని ఒకరున్నారు ఒక సారి ఈ కథ విన్నాక మీకు నచ్చితే మిమ్మల్ని సౌత్ ఇండియాలో ఈ సినిమాకి సమర్పకుడిగా అనుకుంటున్నాను అని చెప్పారు. ఆ తరువాత మొదటి సారి అయాన్ ను కలిసాను. ఈ సినిమాని నాకు 20 నిమిషాలే చూపించి, మా నాన్నగారికి మొత్తం చూపించాడు. అన్నం ఉడికిందా లేదా అని చెప్పడానికి రెండు మెతుకులు ముట్టుకుంటే చాలు అన్నట్లు, నాకు ఆ 20 నిమిషాల్లోనే తెలిసిపోయింది. అలియా భట్ ఈ సినిమాలో ఉండటం దర్శకుడి అదృష్టం, రణబీర్ హృదయంలో ఉండటం రణబీర్ అదృష్టం”
ఇలా బ్రహ్మాస్త్ర సినిమా గురించి గొప్పగా చెప్పుకొచ్చాడు రాజమౌళి. ఇండియన్ స్క్రీన్ పైకి మరో విజువల్ వండర్ రాబోతోందని, ప్రేక్షకులంతా బిగ్ స్క్రీన్ పై దాన్ని చూసి ఎంజాయ్ చేయాలని కోరాడు జక్కన్న.