Telugu Global
National

కళ్లు కనిపించకపోయినా కలలు నిజం చేసుకుంది..

ఆమెకు పుట్టుకతోనే కళ్లు కనిపించవు. కానీ చదువుకోవాలని కల కన్నది, దాన్ని సాధించింది, ఉద్యోగం సాధించాలనుకుంది, దాన్ని కూడా సాధించింది. అన్నిటికంటే మించి సివిల్స్ లో ర్యాంక్ కొట్టాలనుకుంది. చివరకు అదీ సాధించింది. ర్యాంక్ అంటే ఏదో వందల్లో, వేలల్లో కాదు.. టాప్ 50లో ఆమె ఒకరు. టాప్ ఫిఫ్టీలో ఒక బ్లైండ్ వుమన్ కూడా ఉన్నది అంటే అందరికీ ఆశ్చర్యమేసింది. ఆ సూపర్ వుమన్ పేరే ఆయుషి. ఢిల్లీలోని రాణి ఖేరా అనే ప్రాంతంలో పుట్టిన […]

dreams-come-true-even-if-the-eyes-do-not-appear
X

ఆమెకు పుట్టుకతోనే కళ్లు కనిపించవు. కానీ చదువుకోవాలని కల కన్నది, దాన్ని సాధించింది, ఉద్యోగం సాధించాలనుకుంది, దాన్ని కూడా సాధించింది. అన్నిటికంటే మించి సివిల్స్ లో ర్యాంక్ కొట్టాలనుకుంది. చివరకు అదీ సాధించింది. ర్యాంక్ అంటే ఏదో వందల్లో, వేలల్లో కాదు.. టాప్ 50లో ఆమె ఒకరు. టాప్ ఫిఫ్టీలో ఒక బ్లైండ్ వుమన్ కూడా ఉన్నది అంటే అందరికీ ఆశ్చర్యమేసింది. ఆ సూపర్ వుమన్ పేరే ఆయుషి. ఢిల్లీలోని రాణి ఖేరా అనే ప్రాంతంలో పుట్టిన ఆయుషి అక్కడే స్కూల్ చదువు పూర్తి చేసింది. ఢిల్లీ యూనివర్శిటీలో డిగ్రీ చదివింది. హిస్టరీ సబ్జెక్ట్ లో పీజీ చేసింది. ఆ తర్వాత ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా ఉద్యోగం సాధించింది.

కష్టపడితే ఇక్కడి వరకు చేరుకోవడం సాధ్యమే కానీ అంధురాలిగా ఆమె ఇంకెంత కష్టపడి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే అందరికీ కష్టమైన సివిల్స్ పరీక్షను అది కూడా 48వ ర్యాంక్ తో గెలవడం అంటే అలాంటి వారికి కచ్చితంగా అసాధ్యమేనని చెప్పాలి. కానీ దాన్ని కూడా సుసాధ్యం చేసి ఇప్పుడు టాక్ ఆఫ్ ది నేషన్ గా మారింది ఆయుషి.

బిడ్డకోసం తల్లి వాలంటరీ రిటైర్మెంట్..

కూతురు చదువుకోసం తల్లి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంది. తండ్రి పంజాబ్ లో ఓ చిన్న కంపెనీ నడుపుతుంటాడు. తల్లి ప్రోత్సాహం తోనే తాను ఈ ర్యాంక్ సాధించానని గర్వంగా చెబుతారు ఆయుషి. సివిల్స్ లో ర్యాంక్ గ్యారెంటీ అనుకున్నాను కానీ టాప్ 50లో చోటు ఉంటుందని అస్సలు అనుకోలేదని ఆశ్చర్యంగా చెబుతున్నారామె. చదువుకోవాలనే తపన ఉంటే.. అంగవైకల్యం ఎప్పుడూ ఎవరికీ అడ్డు రాదని చెబుతున్నారు ఆయుషి.

ALSO READ : క్యాన్స‌ర్‌కి మందు వ‌చ్చేసింది..

First Published:  1 Jun 2022 2:15 PM IST
Next Story