తెలంగాణలో డిజిటల్ విప్లవం.. ఐటీ ఉత్పత్తుల్లో అగ్రస్థానం
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత నవతెలంగాణలో డిజిటల్ విప్లవం కొత్త పుంతలు తొక్కుతోంది. ఏడాదికేడాది ఐటీ రంగంలో అద్భుతమైన వృద్ధి సాధ్యపడుతోంది. ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే ఐటీ రంగంలో తెలంగాణ ఎవ్వరూ అందుకోలేనంత ఎత్తుకి వెళ్తున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించి రెండో ఐసీటీ పాలసీ ప్రకటించిన తర్వాత పలు కంపెనీలు తెలంగాణను వెతుక్కుంటూ వచ్చాయి. తెలంగాణ ఐటీ గణాంకాలు క్లుప్తంగా.. – 2021-22 ఏడాదికి ఐటీ ఎగుమతుల విలువ 1,83,569 […]
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత నవతెలంగాణలో డిజిటల్ విప్లవం కొత్త పుంతలు తొక్కుతోంది. ఏడాదికేడాది ఐటీ రంగంలో అద్భుతమైన వృద్ధి సాధ్యపడుతోంది. ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే ఐటీ రంగంలో తెలంగాణ ఎవ్వరూ అందుకోలేనంత ఎత్తుకి వెళ్తున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించి రెండో ఐసీటీ పాలసీ ప్రకటించిన తర్వాత పలు కంపెనీలు తెలంగాణను వెతుక్కుంటూ వచ్చాయి.
తెలంగాణ ఐటీ గణాంకాలు క్లుప్తంగా..
– 2021-22 ఏడాదికి ఐటీ ఎగుమతుల విలువ 1,83,569 కోట్ల రూపాయలు
– ఏడాదిలో ఐటీ ఎగుమతుల్లో పెరుగుదల 26.14 శాతం
– 2013-14 నుంచి 2021-22 నాటికి పెరుగుదల 220 శాతం
– 2021-22లో కొత్త ఐటీ ఉద్యోగాలు 1,50,206
– రెండో ఐసీటీ పాలసీ(2021-26) ప్రకారం 3లక్షల కోట్ల రూపాయల ఎగుమతులు, 10 లక్షల ఐటీ ఉద్యోగాలను తెలంగాణ టార్గెట్ గా పెట్టుకుంది.
చిన్న మధ్యతరహా పరిశ్రమలు, స్టార్టప్ కంపెనీలకు తెలంగాణ కేరాఫ్ అడ్రస్ గా మారింది. టైర్ -2 సిటీస్ లో బ్రాంచ్ లను ఓపెన్ చేసే ఐటీ కంపెనీలన్నీ తెలంగాణ ని కేంద్రంగా చేసుకున్నాయి. ఖమ్మం, కరీంనగర్, వరంగల్ లో నెలకొల్పిన ఐటీ టవర్స్ మంచి ఫలితాలనిస్తున్నాయి. నిజామాబాద్, మహబూబ్ నగర్, సిద్ధిపేట్, నల్గొండ లో కూడా గ్రిడ్ పాలసీ ద్వారా ఐటీ రంగానికి అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నారు. హైదరాబాద్ లోని మలక్ పేట, మేడ్చల్ లో కూడా ప్లగ్ అండ్ ప్లే పాలసీ తీసుకొస్తున్నారు.
T-హబ్, వుమన్ ఎంటర్ ప్రెన్యూర్స్(WE)- హబ్ ద్వారా కొత్త కంపెనీలకు తెలంగాణలో హై క్వాలిటీ సపోర్ట్ లభిస్తోంది. స్కూల్, కాలేజీ స్థాయిలోనే విద్యార్థులను గుర్తించి, వారిలో ఐటీ నైపుణ్యాలను పెంచి, Y(యూత్)-హబ్ తయారు చేస్తామంటున్నారు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. చిన్న వయసులోనే టాలెంట్ ని గుర్తించి వారికి సరైన శిక్షణ ఇస్తే.. భవిష్యత్ లో వారినుంచి అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని, గ్రామీణ ప్రతిభ ని ప్రోత్సహించడంలో తెలంగాణ ముందుందని చెబుతున్నారాయన.
టి-శాట్ ద్వారా ఇంటివద్దనే కూర్చుని పిల్లలు నాణ్యమైన విద్యను పొందుతున్నారని, గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉందని చెబుతున్నారు మంత్రి కేటీఆర్. కరోనా కష్టకాలంలో టి-శాట్ పనితీరు అద్భుతంగా ఉందని, గ్రామీణ ప్రాంత విద్యార్థులను ప్రభుత్వ ఉద్యోగాలు సాధించే దిశగా చైతన్య పరచడంలో టి-శాట్ ముందుందని చెప్పారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంపొందించుకోవడంలోనే కాదు, మానవ వనరుల అభివృద్ధి, ఉద్యోగాల కల్పనలో కూడా తెలంగాణ నూతన ఒరవడి సృష్టించిందని చెప్పారు కేటీఆర్. టెక్నాలజీ ఎనేబుల్డ్ స్టేట్ గా తెలంగాణ ఎదుగుతోందని, దీనికి నిదర్శనం తెలంగాణకు వస్తున్న కంపెనీలేనని అంటున్నారు కేటీఆర్. సమష్టి కృషితో ఇది సాధ్యమవుతోందని అన్నారు.