దాదా పొలిటికల్ ఎంట్రీ?.. జోరుగా చర్చ!
బీసీసీఐ చైర్మన్, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ త్వరలో రాజకీయాల్లోకి రాబోతున్నట్టు ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఆయన గత కొంతకాలంగా బీజేపీ నేతలతో క్లోజ్‌గా ఉంటున్నారు. వారి ఇళ్లకు కూడా వెళ్లినట్టు వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే తాజాగా గంగూలీ చేసిన ఓ ట్వీట్ ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. ‘1992లో క్రీడాకారుడిగా జీవితాన్ని ప్రారంభించాను. 2022 వరకు నా ప్రయాణం కొనసాగింది. ఈ జర్నీలో ఎంతోమంది నన్ను ప్రోత్సహించారు. అభిమానులు, ప్రజల ఆదరాభిమానాలను మరువలేను. […]
బీసీసీఐ చైర్మన్, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ త్వరలో రాజకీయాల్లోకి రాబోతున్నట్టు ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఆయన గత కొంతకాలంగా బీజేపీ నేతలతో క్లోజ్‌గా ఉంటున్నారు. వారి ఇళ్లకు కూడా వెళ్లినట్టు వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే తాజాగా గంగూలీ చేసిన ఓ ట్వీట్ ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. ‘1992లో క్రీడాకారుడిగా జీవితాన్ని ప్రారంభించాను. 2022 వరకు నా ప్రయాణం కొనసాగింది. ఈ జర్నీలో ఎంతోమంది నన్ను ప్రోత్సహించారు. అభిమానులు, ప్రజల ఆదరాభిమానాలను మరువలేను. వారు నా వెన్నంటే ఉన్నారు.
ప్రస్తుతం నేను మరోదారిని ఎంచుకోవాలనుకుంటున్నాను. ప్రజలకు చేరువ కావాలనుకుంటున్నారు. నా ప్రయాణానికి ప్రజలు సహకరిస్తారని ఆశిస్తున్నా’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. దీంతో ఆయన పొలిటికల్ ఎంట్రీ ఖాయమన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే పశ్చిమబెంగాల్‌లో ఎలాగైనా పట్టు సాధించాలని బీజేపీ శతవిధాలా ప్రయత్నిస్తోంది. కానీ అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న మమతా బెనర్జీ ధాటికి ఆమె వ్యూహాలకు బీజేపీ తట్టుకోలేకపోతున్నది. ఎన్ని ఎత్తులు వేసినా.. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలోని ముఖ్యనేతలను లాక్కున్నా.. ఆమెను గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించడం బీజేపీ వల్ల కాలేదు.
దీంతో మమతా బెనర్జీ మీదకు గంగూలీని అస్త్రంగా వదలాలని బీజేపీ భావిస్తున్నట్టు సమాచారం. బీజేపీ బలానికి .. గంగూలీ ఫాలోయింగ్ కూడా తోడైతే పశ్చిమ బెంగాల్ లో బలపడవచ్చని బీజేపీ భావిస్తున్నట్టు టాక్. ఇందులో భాగంగానే గంగూలీని తమ వైపునకు తిప్పుకోవాలని ఆ పార్టీ చూస్తున్నట్టు తెలుస్తోంది. మరి బీజేపీ బలోపేతం అయ్యేందుకు గంగూలీ ఏ మేరకు ఉపయోగపడతాడో వేచి చూడాలి. నిజంగానే ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి బీజేపీలో చేరతారా? మరేదైనా వ్యూహం ఉందా? అన్నది కూడా తెలియాల్సి ఉంది.