Telugu Global
NEWS

దావోసులో విశాఖ ముంపు ప్రస్తావన, మంత్రి కంట కన్నీరు

దావోస్ పర్యటన వివరాలను వెల్లడించిన మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌.. అక్కడ తమకు ఎదురైన అనుభవాన్ని వివరించారు. దావోసు సదస్సులో ఒక సంస్థ ప్రతినిధి .. వదరలొస్తే విశాఖపట్నం మునిగిపోతుందట కదా అని ప్రశ్నించారని అమర్‌నాథ్ చెప్పారు. ఆ మాటతో తనకు చాలా బాధేసిందన్నారు. తన కళ్లలో నీరు తిరిగాయన్నారు. విశాఖపట్నం మునిగిపోతుందంటూ ఒక వర్గం మీడియా చేసిన ప్రచారం కారణంగానే ఈ ప్రశ్న ఎదురైందన్నారు. విశాఖ మునిగిపోతుందంటూ నగర ఇమేజ్‌ను దెబ్బతీశారని మంత్రి విమర్శించారు. ప్రతిపక్ష పార్టీకి మేలు […]

దావోసులో విశాఖ ముంపు ప్రస్తావన, మంత్రి కంట కన్నీరు
X

దావోస్ పర్యటన వివరాలను వెల్లడించిన మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌.. అక్కడ తమకు ఎదురైన అనుభవాన్ని వివరించారు. దావోసు సదస్సులో ఒక సంస్థ ప్రతినిధి .. వదరలొస్తే విశాఖపట్నం మునిగిపోతుందట కదా అని ప్రశ్నించారని అమర్‌నాథ్ చెప్పారు. ఆ మాటతో తనకు చాలా బాధేసిందన్నారు. తన కళ్లలో నీరు తిరిగాయన్నారు.

విశాఖపట్నం మునిగిపోతుందంటూ ఒక వర్గం మీడియా చేసిన ప్రచారం కారణంగానే ఈ ప్రశ్న ఎదురైందన్నారు. విశాఖ మునిగిపోతుందంటూ నగర ఇమేజ్‌ను దెబ్బతీశారని మంత్రి విమర్శించారు. ప్రతిపక్ష పార్టీకి మేలు చేయాలన్న ఉద్దేశంతోనే ఒక వర్గం మీడియా ఈ ప్రచారం చేసిందన్నారు. రాష్ట్రానికి, విశాఖకు హాని కలిగించే ప్రయత్నం, ప్రచారం చేయవద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు.

విశాఖ మునిగిపోతుందా అని అనుమానం వ్యక్తం చేసిన సంస్థ ప్రతినిధికి వాస్తవ పరిస్థితిని వివరించామని మంత్రి వెల్లడించారు. అయితే విశాఖపై ఇలాంటి ప్రచారం ఒక వర్గం మీడియా చేయడం ముమ్మాటికే తప్పే. విశాఖ పట్నం దగ్గర సముద్రంలో భారీ చీలిక కూడా ఉందంటూ ఒక పత్రిక కథనం రాసింది గతంలో. ఈ ప్రచారానికి కారణం ఏపీలో రాజకీయలే. చంద్రబాబుకు ఇష్టమైన అమరావతి వరదలొస్తే మునిగిపోతుందని వైసీపీ, ఆ పార్టీ మీడియా ప్రచారం చేసింది. అందుకు కౌంటర్‌గా జగన్‌కు ఇష్టమైన విశాఖను భవిష్యత్తులో సముద్రం ముంచేస్తుందని పత్రిపక్ష మీడియా ప్రచారం చేసింది.

విశాఖ అయినా, మరో ప్రాంతమైనా అవి తమ రాష్ట్రంలో అంతర్భాగమే అన్న భావన నుంచి… ఒక్కో ప్రాంతాన్ని ఒక్కొక్కరికి అంటగట్టి చూసే బుద్ది కారణంగానే ఏపీపై అనేక అపోహలు బయట ప్రపంచంలో ఏర్పడ్డాయి.

First Published:  1 Jun 2022 2:49 AM IST
Next Story