అయ్యన్నపై నిప్పులు చెరిగిన విజయసాయి..
ఇటీవల సీఎం జగన్ దావోస్ పర్యటనను టార్గెట్ చేసుకుని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ట్విట్టర్లో తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలో ఆయన ఎంపీ విజయసాయిరెడ్డిపై కూడా మాటల తూటాలు పేల్చారు. వాటన్నిటికీ ఇప్పుడు విజయసాయి బదులు తీర్చేశారు. అయ్యన్నపై కౌంటర్ అటాక్ మొదలు పెట్టారు. నిన్న లోకేష్ ని.. ఎలకేష్, బోకేష్ అంటూ ఘాటుగా విమర్శించిన విజయసాయి.. ఈరోజు అయ్యన్నపాత్రుడిని కొజ్జా రికార్డింగ్ డ్యాన్సర్ అంటూ దుయ్యబట్టారు. సామాజిక న్యాయభేరి బస్సు యాత్రలో రికార్డింగ్ డ్యాన్స్ […]
ఇటీవల సీఎం జగన్ దావోస్ పర్యటనను టార్గెట్ చేసుకుని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ట్విట్టర్లో తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలో ఆయన ఎంపీ విజయసాయిరెడ్డిపై కూడా మాటల తూటాలు పేల్చారు. వాటన్నిటికీ ఇప్పుడు విజయసాయి బదులు తీర్చేశారు. అయ్యన్నపై కౌంటర్ అటాక్ మొదలు పెట్టారు. నిన్న లోకేష్ ని.. ఎలకేష్, బోకేష్ అంటూ ఘాటుగా విమర్శించిన విజయసాయి.. ఈరోజు అయ్యన్నపాత్రుడిని కొజ్జా రికార్డింగ్ డ్యాన్సర్ అంటూ దుయ్యబట్టారు. సామాజిక న్యాయభేరి బస్సు యాత్రలో రికార్డింగ్ డ్యాన్స్ లు ఏంటంటూ అయ్యన్న వేసిన ట్వీట్ కి విజయసాయి ఇలా కౌంటర్ ఇచ్చారు.
బాయ్య లోకెల్లా అతి పెద్ద బాయ్య.. వాడి పేరు చింతకాయ! అంటూ ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు విజయసాయిరెడ్డి. ఆయన తాగేది మందు, దూరేది సందు, చెప్పేది శ్రీరంగ నీతులు అంటూ సెటైర్లు పేల్చారు. అడ్డగాడిదకు మత్తు దింపేస్తామని హెచ్చరించారు. కొజ్జా రికార్డింగ్ డ్యాన్సర్ గాడు అంటూ ఘాటైన పదాలతో బదులిచ్చారు.
విజయసాయిరెడ్డి ట్వీట్ ఇదీ..
“బాయ్య లోకెల్లా అతి పెద్ద బాయ్య.. వాడి పేరు చింతకాయ!
ఈ కొజ్జా రికార్డింగ్ డ్యాన్సర్ గాడు, తాగేది మందు.. దూరేది సందు.. చెప్పేది శ్రీరంగనీతులా? ఈ అడ్డగాడిద మత్తు అడ్డంగా దింపేసే టైమ్ దగ్గర పడింది..”
మొత్తమ్మీద ఎన్నికలకు రెండేళ్ల ముందుగానే ఏపీలో రాజకీయ వాతావరణం బాగా వేడెక్కింది. విమర్శలు, ప్రతి విమర్శలతో ఒకరిపై ఒకరు మాటల దాడి మొదలు పెట్టారు. మెయిన్ స్ట్రీమ్ మీడియాను పక్కనపెట్టి.. సోషల్ మీడియా ద్వారా మాటకు మాట బదులిస్తున్నారు నేతలు.