డ్రగ్స్ రవాణా చేస్తుండగా ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లను అరెస్టు చేసిన తెలంగాణ పోలీసులు
డ్రగ్స్ రవాణా చేస్తున్న ఇద్దరు సాఫ్ట్ వేర్ ఉద్యోగులను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో వారిని అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి లక్ష రూపాయల విలువైన డ్రగ్స్, 2.35 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వట్టూరి సూర్యసంపత్ , రాజమండ్రికి చెందిన దీపక్ ఫణీంద్ర స్నేహితులు. ఇద్దరూ సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేస్తున్నారు. గోవా నుంచి మాదక ద్రవ్యాలను దిగుమతి చేసుకుని హైదరాబాద్‌తోపాటు […]
డ్రగ్స్ రవాణా చేస్తున్న ఇద్దరు సాఫ్ట్ వేర్ ఉద్యోగులను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో వారిని అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి లక్ష రూపాయల విలువైన డ్రగ్స్, 2.35 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వట్టూరి సూర్యసంపత్ , రాజమండ్రికి చెందిన దీపక్ ఫణీంద్ర స్నేహితులు. ఇద్దరూ సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేస్తున్నారు. గోవా నుంచి మాదక ద్రవ్యాలను దిగుమతి చేసుకుని హైదరాబాద్‌తోపాటు సమీప ప్రాంతాలకు కొంతకాలంగా సరఫరా చేస్తున్నారు.
గోవాలోని ఓ వ్యక్తి నుంచి నిషేధిత ఎండీఎంఏ 25 మాత్రలు, ఎల్‌ఎస్‌డీ-2 మత్తుపదార్థాలు కొనుగోలు చేసి సూర్య, దీపక్‌లు గోవా నుంచి బస్సులో హైదరాబాద్ వచ్చారు. మే 28న హైదరాబాద్‌లోని ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ తిరిగారు. సోమవారం నాడు పెద్దఅంబర్‌పేట మీదుగా రాజమండ్రికి ట్రక్కులో మాదక ద్రవ్యాలు తరలిస్తుండగా చౌటుప్పల్‌లో పోలీసులు పట్టుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించనున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.