సరికొత్త రికార్డ్ సృష్టించిన ఆర్ఆర్ఆర్
జీ5 లో ఆర్ఆర్ఆర్ స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. మే 20 నుండి సౌత్ లోని అన్ని భాషల్లో ఈ సినిమా జీ5లో అందుబాటులో ఉంది. ఓటీటీ విభాగంలో ఇండియాలోనే అతిపెద్ద బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచింది ఆర్ఆర్ఆర్. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో జీ5లో 1,000 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలతో దూసుకుపోతూ ఓటీటీలో రికార్డ్ సృష్టించింది ఆర్ఆర్ఆర్. విడుదలైన నాలుగు భాషల్లో ఈ సినిమా ట్రెండింగ్‌లో అగ్రస్థానంలో ఉంది. జీ5లో ఆర్ఆర్ఆర్ సూపర్ హిట్టవ్వడంపై రామ్ […]
జీ5 లో ఆర్ఆర్ఆర్ స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. మే 20 నుండి సౌత్ లోని అన్ని భాషల్లో ఈ సినిమా జీ5లో అందుబాటులో ఉంది. ఓటీటీ విభాగంలో ఇండియాలోనే అతిపెద్ద బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచింది ఆర్ఆర్ఆర్. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో జీ5లో 1,000 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలతో దూసుకుపోతూ ఓటీటీలో రికార్డ్ సృష్టించింది ఆర్ఆర్ఆర్. విడుదలైన నాలుగు భాషల్లో ఈ సినిమా ట్రెండింగ్‌లో అగ్రస్థానంలో ఉంది.
జీ5లో ఆర్ఆర్ఆర్ సూపర్ హిట్టవ్వడంపై రామ్ చరణ్ ఆనందం వ్యక్తం చేశాడు. “ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో విడుదలై హిట్ అయినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మా చిత్రాన్ని 1,000 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలతో దూసుకుపోతూ రికార్డ్ సృస్టించేలా చేసిన జీ5 వీక్షకులకు ధన్యవాదాలు” అని తెలిపాడు.
రాజమౌళి దర్శకత్వంలో దాదాపు 450 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కింది ఆర్ఆర్ఆర్ సినిమా. ఈ సినిమా సౌత్ స్ట్రీమింగ్ రైట్స్ ను జీ గ్రూప్, ఏకంగా 200 కోట్ల రూపాయలు చెల్లించి దక్కించుకుంది. దీంతో పాటు హిందీ శాటిలైట్ రైట్స్ కూడా జీ గ్రూప్ వశమయ్యాయి. మరోవైపు ఈ సినిమా హిందీ స్ట్రీమింగ్ రైట్స్ ను మాత్రం నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈ సినిమా హిందీ వెర్షన్ కు నెట్ ఫ్లిక్స్ లో అనూహ్య స్పందన వస్తోంది.