ఉపాధ్యాయురాలిని కాల్చి చంపిన ఉగ్రవాదులు
దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గామ్ ప్రాంతంలో మంగళవారం ఉదయం ఉగ్రవాదులు ఒక మహిళా టీచర్ ను కాల్చి చంపారు. రజనీ అనే ఈ ఉపాధ్యాయురాలు జమ్మూ ప్రాంతంలోని సాంబా నివాసి. మంగళవారం ఉదయం, దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గాం ప్రాంతంలోని గోపాల్‌పోరా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోకి ఉగ్రవాదులు చొరబడి, ఉపాధ్యాయురాలిపై కాల్పులు జరపడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆ ప్రాంతాన్ని భద్రతా దళాలు చుట్టుముట్టారు. కాశ్మీరీ పండిట్ […]
దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గామ్ ప్రాంతంలో మంగళవారం ఉదయం ఉగ్రవాదులు ఒక మహిళా టీచర్ ను కాల్చి చంపారు. రజనీ అనే ఈ ఉపాధ్యాయురాలు జమ్మూ ప్రాంతంలోని సాంబా నివాసి.
మంగళవారం ఉదయం, దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గాం ప్రాంతంలోని గోపాల్‌పోరా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోకి ఉగ్రవాదులు చొరబడి, ఉపాధ్యాయురాలిపై కాల్పులు జరపడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆ ప్రాంతాన్ని భద్రతా దళాలు చుట్టుముట్టారు.
కాశ్మీరీ పండిట్ అయిన ప్రభుత్వ ఉద్యోగి రాహుల్ భట్ ను సెంట్రల్ కాశ్మీర్‌లోని చదూరాలో తన కార్యాలయంలో హత్య చేసిన రెండు వారాల తర్వాత ఈ రోజు ఉపాధ్యాయిని హత్య జరిగింది. మే 12న జరిగిన భట్ హత్య సమాజం నుండి భారీ నిరసనలకు దారితీసింది.
మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ మాట్లాడుతూ, ”ఈ హత్య కాశ్మీర్‌లో సాధారణ స్థితి ఉందని బిజెపి చేస్తున్న వాదనలు అబద్దమని తేల్చేసింది. ఉగ్రవాదుల పిరికిపంద చర్యను ప్రతి ఒక్కరూ ఖండించాలి” అని ఆమె అన్నారు.
మాజీ ముఖ్యమంత్రి, ఒమర్ అబ్దుల్లా ఈ హత్య బాధాకరమని పేర్కొన్నారు. “చాలా విచారకరంగా. నిరాయుధ పౌరులను లక్ష్యంగా చేసుకుని ఇటీవలి దాడులు ఎక్కువయ్యాయి. మృతులకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను” అని ఒమర్ ట్వీట్ చేశారు.
పీపుల్స్ కాన్ఫరెన్స్ నాయకుడు సజాద్ లోన్ ఇలా అన్నారు: “పిరికితనం మళ్లీ సిగ్గులేని లోతులకు పడిపోయింది. కుల్గామ్‌లో సాంబాకు చెందిన ఒక ఉపాధ్యాయురాలు, ఒక అమాయక మహిళ కాల్చి చంపబడింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి”