టీడీపీపై దివ్యవాణి సంచలన వ్యాఖ్యలు, రాజీనామా
నటి, టీడీపీ నాయకులు దివ్యవాణి టీడీపీ నాయకత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్టూ ప్రకటించారు. తనకు పార్టీలో అవకాశాలు ఇవ్వడం లేదని విమర్శించారు. చివరకు మహానాడులో మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వలేదని.. దాంతో తాను ఇంటికి వచ్చి ఏడ్చేశానన్నారు. రాజకీయాల్లోకి రాకముందు దేవుడి బిడ్డగా( క్రైస్తవ మత ప్రచారం చేసేవారు గతంలో) తాను ముద్రింపపడి ఉన్నానని చెప్పారామె. టీడీపీలోకి వచ్చిన తర్వాత తన శక్తి మేర పనిచేశానన్నారు. కానీ పార్టీలో తనకు సరైన న్యాయం […]
నటి, టీడీపీ నాయకులు దివ్యవాణి టీడీపీ నాయకత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్టూ ప్రకటించారు. తనకు పార్టీలో అవకాశాలు ఇవ్వడం లేదని విమర్శించారు. చివరకు మహానాడులో మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వలేదని.. దాంతో తాను ఇంటికి వచ్చి ఏడ్చేశానన్నారు. రాజకీయాల్లోకి రాకముందు దేవుడి బిడ్డగా( క్రైస్తవ మత ప్రచారం చేసేవారు గతంలో) తాను ముద్రింపపడి ఉన్నానని చెప్పారామె. టీడీపీలోకి వచ్చిన తర్వాత తన శక్తి మేర పనిచేశానన్నారు. కానీ పార్టీలో తనకు సరైన న్యాయం జరగడం లేదన్నారు. మీకు సరైన న్యాయం జరుగుతోందా అని ఇతరులు కూడా తనను ప్రశ్నించారన్నారు.
వ్యాపార సంబంధాలున్న ఒక్క మురళీమోహన్ తప్ప.. రోజా, జయపద్ర, కవిత, అలీ, జయసుధ ఇలా కళాకారులు అందరూ ఎందుకు పార్టీలో ఉండలేకపోయారు అన్నది తనకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోందన్నారు. చాలా మంది ప్రభువును నమ్ముకున్న వ్యక్తిగా తనకు.. ఆల్‌రెడీ ప్రభువుతో కనెక్ట్ అయిన వారున్న వైసీపీతో ఈజీగా కనెక్ట్ అవుతావని సలహా ఇస్తున్నారన్నారు. టీడీపీలో అధికారం లేని అధికారప్రతినిధిగా తనను కూర్చోబెట్టారని దివ్యవాణి ఆవేదన వ్యక్తం చేశారు.
మహిళా అధ్యక్షురాలిగా చేసే సామర్థ్యం తనకు లేదా అని ప్రశ్నించారు. మహానాడులో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవడంతో ఇంటికి వచ్చి ఏడ్చేశానని… తాను చనిపోతే శవంతోనూ ఓట్లు అడుగుతారేమో అనిపిస్తోందన్నారు దివ్యవాణి. గతంలో నటి కవిత కూడా మహానాడు వద్ద జరిగిన అవమానంతోనే టీడీపీని వదిలిపెట్టారు. ఇప్పుడు దివ్యవాణి కూడా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. పార్టీలో కొన్ని దుష్టశక్తుల ప్రమేయాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు ట్వీట్ చేశారు.