Telugu Global
National

నిందితుడికి క్లీన్ చిట్.. అధికారిపై బదిలీ వేటు..

ముంబై క్రూజ్ షిప్ డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న ఆర్యన్ ఖాన్ కి కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. నిర్దోషిగా ఆర్యన్ ఖాన్ విడుదలైన తర్వాత.. ఈ కేసుని డీల్ చేసిన అధికారి సమీర్ వాంఖడేపై ఆరోపణలు తీవ్రతరం అయ్యాయి. కేసు విచారణలో నిర్లక్ష్యంగా వ్యవహిరంచినందుకు సమీర్ వాంఖడేపై చర్యలు తీసుకోవాలని ఇటీవల కేంద్రం ఆదేశించింది. దీంతో ముంబైలోని డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) లో ఉన్న సమీర్ తాజాగా.. చెన్నైలోని డైరెక్టర్ […]

నిందితుడికి క్లీన్ చిట్.. అధికారిపై బదిలీ వేటు..
X

ముంబై క్రూజ్ షిప్ డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న ఆర్యన్ ఖాన్ కి కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. నిర్దోషిగా ఆర్యన్ ఖాన్ విడుదలైన తర్వాత.. ఈ కేసుని డీల్ చేసిన అధికారి సమీర్ వాంఖడేపై ఆరోపణలు తీవ్రతరం అయ్యాయి. కేసు విచారణలో నిర్లక్ష్యంగా వ్యవహిరంచినందుకు సమీర్ వాంఖడేపై చర్యలు తీసుకోవాలని ఇటీవల కేంద్రం ఆదేశించింది. దీంతో ముంబైలోని డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) లో ఉన్న సమీర్ తాజాగా.. చెన్నైలోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్యాక్స్‌పేయర్‌ సర్వీస్‌ డైరెక్టరేట్‌ కు బదిలీ అయ్యారు. ఈమేరకు బదిలీ వేటు వేస్తూ అధికారులు ఉత్తర్వులు విడుదల చేశారు.

క్రూజ్ నౌకలో డ్రగ్స్ పట్టుబడిన కేసులో.. ప్రముఖ హీరో షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ అరెస్ట్ కావడంతో అప్పట్లో ఈ కేసు సంచలనంగా మారింది. కేసు విచారణ చేపట్టిన ఎన్సీబీ అధికారి సమీర్ వాంఖడే కూడా టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారారు. ఒత్తిడులకు లొంగలేదని, లంచాలకు దొరకలేదని.. సమీర్ వాంఖడేని మీడియానే హీరోగా చేసింది. ఆ తర్వాత వివిధ ఆరోపణలతో వాంఖడేని డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ)కి బదిలీ చేశారు. చివరకు కొండను తవ్వి ఎలుకను కూడా పట్టనట్టుగా.. క్రూజ్ డ్రగ్స్ కేసులో ఎన్సీబీ ఎలాంటి ఆధారాలను చూపించలేకపోయింది. ఫలితంగా ఆర్యన్ ఖాన్ ని కోర్టు నిర్దోషిగా తేల్చి విడుదల చేసింది.

బదిలీ వేటుకి బలైన సమీర్..

తప్పు చేసింది ఎవరు..? అసలు నిజంగానే తప్పు జరిగిందా..? నిందితులకు వ్యతిరేకంగా ఎందుకు సాక్ష్యాలు దొరకలేదు.. అనే విషయాలను పక్కనపెడితే.. కేసు విచారణలో జరిగిన నాటకీయ పరిణామాలతో సమీర్ వాంఖడే దోషిగా తేలారు. డ్రగ్స్‌ కేసులో వాంఖడే బృందం నిర్లిప్తంగా వ్యవహరించి, పలు అవకతవకలకు పాల్పడినట్లు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దర్యాప్తులో తేలింది. దీంతో ఆయనపై కేంద్రం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ ఆదేశాలతో సమీర్ నేరుగా చెన్నై వచ్చి చేరారు. చెన్నైలోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్యాక్స్‌పేయర్‌ సర్వీసెస్ కు సమీర్ వాంఖడే బదిలీ అయ్యారు.

First Published:  31 May 2022 9:16 AM IST
Next Story