Telugu Global
NEWS

అసైన్డ్‌కు పరిహారం ఇవ్వాల్సిందే..

అసైన్డ్ భూములకూ పరిహారం చెల్లించాల్సిందేనని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. ప్రజోపయోగం కోసం వెనక్కు తీసుకున్న అసైన్డ్ భూములకు.. పట్టా భూములతో సమానంగా పరిహారం చెల్లించాల్సిందేనని తీర్పు తెచ్చింది. 2013 భూసేకరణ చట్టం కిందనైనా, రాష్ట్రంలో ఉన్న ఇతర చట్టాల కిందనైనా అసైన్డ్ భూములకు పరిహారం పొందేందుకు అర్హత ఉంటుందని హైకోర్టు వెల్లడించింది. ఇండస్ట్రియల్ పార్క్ కోసం అధికారులు వెనక్కు తీసుకున్న తమ అసైన్డ్ భూములకు ఎలాంటి పరిహారం ఇవ్వలేదని, తమకూ పట్టా భూములతో సమానంగా పరిహారం […]

అసైన్డ్‌కు పరిహారం ఇవ్వాల్సిందే..
X

అసైన్డ్ భూములకూ పరిహారం చెల్లించాల్సిందేనని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. ప్రజోపయోగం కోసం వెనక్కు తీసుకున్న అసైన్డ్ భూములకు.. పట్టా భూములతో సమానంగా పరిహారం చెల్లించాల్సిందేనని తీర్పు తెచ్చింది.

2013 భూసేకరణ చట్టం కిందనైనా, రాష్ట్రంలో ఉన్న ఇతర చట్టాల కిందనైనా అసైన్డ్ భూములకు పరిహారం పొందేందుకు అర్హత ఉంటుందని హైకోర్టు వెల్లడించింది. ఇండస్ట్రియల్ పార్క్ కోసం అధికారులు వెనక్కు తీసుకున్న తమ అసైన్డ్ భూములకు ఎలాంటి పరిహారం ఇవ్వలేదని, తమకూ పట్టా భూములతో సమానంగా పరిహారం చెల్లించేలా ఆదేశించాలంటూ చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం మంగళం గ్రామస్తులు 2018లో హైకోర్టును ఆశ్రయించారు.

ఈ కేసులో న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణమూర్తి తీర్పు వెలువరించారు. 2013 భూ సేకరణ చట్టం పరిహారానికి ఎవరు అర్హులు అన్నది స్పష్టంగా వివరిస్తోందని.. 2016లో జారీ చేసిన జీవో 259 ప్రకారం అసైన్డ్‌ భూమికి పట్టా భూమితో సమానంగా పరిహారం చెల్లించాల్సి ఉంటుందని పిటిషనర్ల తరపు న్యాయవాది వాదించారు. అందుకు స్పందించిన ప్రభుత్వ న్యాయవాది.. మేకల పాండు కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించిందని గుర్తు చేశారు.

ఆ స్టే ఎత్తివేసేంత వరకు జీవో 259 ప్రకారం పిటిషనర్లు కోరిన పరిహారం చెల్లింపు సాధ్యం కాదని వాదించారు. ప్రభుత్వ వాదనను న్యాయమూర్తి తోసి పుచ్చారు. ఆరు నెలల్లోగా ఈ పిటిషన్‌లోని పిటిషనర్లకు పరిహారం చెల్లించాలంటూ ఆదేశించారు.

First Published:  31 May 2022 1:46 AM IST
Next Story