Telugu Global

మోదీ 8 ఏళ్ళ పాలనపై 8 ప్రశ్నలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గద్దెనెక్కి 8 ఏళ్ళు అయిన సందర్భంగా బీజేపీ దేశవ్యాప్తంగా వేడుకలను నిర్వహిస్తోంది. ఈ 8 ఏళ్ళ పాలనలో దేశం అభివృద్ది పథంలో దూసుక పోయిందని, విశ్వగురువుగా అవతరించిందని బీజేపీ ప్రచారం చేస్తోంది. అయితే బీజేపీ ప్రచారంలోని డొల్ల తనాన్ని బహిర్గతపరుస్తూ టీఆరెస్ నాయకురాలు, ఎమ్ ఎల్ సీ కల్వకుంట్ల కవిత ట్విట్టర్ లో ప్రధాని మోడీ పై 8 ప్రశ్నలు సంధించారు. మోదీ 8 ఏళ్ళ పాలనా వైఫల్యాలను ఎండగట్టిన కవిత తన […]

మోదీ 8 ఏళ్ళ పాలనపై 8 ప్రశ్నలు
X

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గద్దెనెక్కి 8 ఏళ్ళు అయిన సందర్భంగా బీజేపీ దేశవ్యాప్తంగా వేడుకలను నిర్వహిస్తోంది. ఈ 8 ఏళ్ళ పాలనలో దేశం అభివృద్ది పథంలో దూసుక పోయిందని, విశ్వగురువుగా అవతరించిందని బీజేపీ ప్రచారం చేస్తోంది. అయితే బీజేపీ ప్రచారంలోని డొల్ల తనాన్ని బహిర్గతపరుస్తూ టీఆరెస్ నాయకురాలు, ఎమ్ ఎల్ సీ కల్వకుంట్ల కవిత ట్విట్టర్ లో ప్రధాని మోడీ పై 8 ప్రశ్నలు సంధించారు. మోదీ 8 ఏళ్ళ పాలనా వైఫల్యాలను ఎండగట్టిన కవిత తన ప్రశ్నలకు సమాధానమివ్వాలని మోదీకి సవాల్ విసిరారు.

కవిత సంధించిన 8 ప్రశ్నలు….

1.మహిళా శక్తికి సమాన ప్రాధాన్యత కల్పించడం ద్వారా మ‌హిళా సాధికారత సాధించగల‍ం. మరి మహిళా రిజర్వేషన్ బిల్లు ఎక్కడ మోడీ జీ

2.మన దేశ జీడీపీ పడిపోతున్నా.. గ్యాస్,డీజిల్,పెట్రోల్ (జీడీపీ) ధరలు పెరుగుతున్నాయి. అవి కేంద్ర‌ప్రభుత్వ నియంత్రణలో ఎందుకు లేవు? ఇంత ఎక్కువగా పెంచిన ఇంధ‌న‌ ధరల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఎక్కడ పెట్టుబడిగా పెట్టారు?

3. తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ ప్రభుత్వ పక్షపాతానికి ముగింపు ఎప్పుడు? తెలంగాణకు రావాల్సిన 7000 కోట్ల రూపాయల పెండింగ్‌ నిధులను బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తుంది?

4.ద్రవ్యోల్బణం రికార్డు స్థాయికి చేరుకుంది. అధిక ధరలనుండి భారత్ ను విముక్తి చేస్తా అని ప్రకటించుకున్న మీరు అసలు అలాంటి “అచ్ఛే దిన్” ఎప్పుడు తెస్తారు?

5.విఫలమైన లా అండ్ ఆర్డర్, విఫలమైన వ్యవస్థలు.. భారతదేశ ప్రజలకు అబద్దపు ప్రచారాలు లేని నిజమైన “అమృత్ కాల్” ఎప్పుడు వస్తుంది?

6. రైతులు భారతదేశానికి గుండె చప్పుడు.. కానీ, ఈ రోజు తెలంగాణలోని వరి రైతులు, పసుపు రైతులు తమ కష్టానికి కనీస గుర్తింపును కోరినందుకు బీజేపీ చేతిలో నష్టపోతున్నారు!

7. మోడీ ప్రభుత్వ “న్యూ ఇండియా” వాస్తవికత ఏంటంటే, ఇక్కడ కోట్లాది మంది భారతీయులు తమకు కనీస ఆదాయం అందించే ఉపాధిని పొందలేకపోతున్నారు.

8. చివరగా, పీఎం కేర్స్ నిధుల గురించిన నిజమైన సమాచారం దేశ‌ ప్రజలకు తెలియజేసే రోజు వస్తుందా?

అని మోదీకి 8 ప్రశ్నలు సంధించారు కవిత. మరి కవిత ప్రశ్నలకు మోదీ కానీ ఆయన సహచరులు కానీ సమాధానం చెప్తారా ? వేచి చూడాలి.

ALSO READ: చరిత్ర సృష్టించిన బిషప్ పూల ఆంథోనీ.. చరిత్రలో తొలి తెలుగు కార్డినల్

First Published:  30 May 2022 12:22 PM IST
Next Story