Telugu Global
National

హిజాబ్ గొడవతో చదువుకి దూరమవుతున్న ముస్లిం విద్యార్థినులు

కర్నాటకలో హిజాబ్ వివాదం చాలామంది ముస్లిం విద్యార్థినులను చదువుకి దూరం చేసింది. హిజాబ్ ధరించి స్కూల్స్, కాలేజీలకు రావొద్దని, అది మతపరమైన ఆచారం కాదని కర్నాటక హైకోర్టు తీర్పునిచ్చిన తర్వాత కొంతమంది తమ అలవాటు మార్చుకున్నారు. హిజాబ్ లేకుండా విద్యాసంస్థలకు వచ్చారు. అయితే మరికొంతమంది మాత్రం పరీక్షలను సైతం వద్దనుకున్నారు. ఇక హిజాబ్ వివాదంలో ఇటీవల మరో పరిణామం చోటు చేసుకుంది. హిజాబ్ గురించి కోర్టు ఇచ్చిన తీర్పు కేవలం ప్రీ యూనివర్శిటీ కాలేజీలకేనని, యూనివర్శిటీలకు కాదనే […]

హిజాబ్ గొడవతో చదువుకి దూరమవుతున్న ముస్లిం విద్యార్థినులు
X

కర్నాటకలో హిజాబ్ వివాదం చాలామంది ముస్లిం విద్యార్థినులను చదువుకి దూరం చేసింది. హిజాబ్ ధరించి స్కూల్స్, కాలేజీలకు రావొద్దని, అది మతపరమైన ఆచారం కాదని కర్నాటక హైకోర్టు తీర్పునిచ్చిన తర్వాత కొంతమంది తమ అలవాటు మార్చుకున్నారు. హిజాబ్ లేకుండా విద్యాసంస్థలకు వచ్చారు. అయితే మరికొంతమంది మాత్రం పరీక్షలను సైతం వద్దనుకున్నారు. ఇక హిజాబ్ వివాదంలో ఇటీవల మరో పరిణామం చోటు చేసుకుంది. హిజాబ్ గురించి కోర్టు ఇచ్చిన తీర్పు కేవలం ప్రీ యూనివర్శిటీ కాలేజీలకేనని, యూనివర్శిటీలకు కాదనే వాదన తెరపైకి వచ్చింది. మంగుళూరు యూనివర్శిటీ ఇప్పటికీ హిజాబ్ పై నిషేధం విధించకపోవడాన్ని ఏబీవీపీ తప్పుబట్టింది. గత వారం ఏబీవీపీ నేతలు ఆందోళన చేపట్టడం, ఆ తర్వాత సీఎం బసవరాజ్ బొమ్మై గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో మంగుళూరు యూనివర్శిటి కూడా హిజాబ్ పై నిషేధం విధించింది ముసుగు ధరించి విద్యార్థినులు క్లాస్ లకు అటెండ్ కావొద్దని సూచించింది.

మంగళూరు యూనివర్శిటీతోపాటు మరికొన్ని సంస్థలు కూడా ఇప్పటి వరకూ హిజాబ్ కు అనుమతి ఇస్తూ వచ్చాయి. సీఎం బసవరాజ్ బొమ్మై హెచ్చరికల నేపథ్యంలో ఆయా సంస్థలు కూడా హిజాబ్ పై కఠినంగానే ఉంటున్నాయి. దీంతో పేద ముస్లిం అమ్మాయిలు కాలేజీలకు వచ్చేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఇంట్లో హిజాబ్ ధరించడం తప్పనిసరి చేశారని, బయటకు వెళ్తే హిజాబ్ ధరించే ఉండాలంటూ తమకు తల్లిదండ్రులు సూచిస్తున్నారని, కానీ కాలేజీలో నియమ నిబంధనలు మార్చడం సరికాదని ఆరోపిస్తున్నారు విద్యార్థినులు. మంగళూరూ యూనివర్శిటీలో ఫీజులు తక్కువ ఉంటాయని, హిజాబ్ పై కూడా ఇప్పటి వరకూ ఎలాంటి ఆక్షేపణ లేదని, అందుకే తమ చదువులు సక్రమంగా సాగాయని, ఇప్పుడు కొత్తగా ఈ గొడవ ఏంటని ప్రస్నిస్తున్నారు అమ్మాయిలు.

మంగళూరు యూనివర్శిటీ అధికారులు మాత్రం తాము ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నామని చేతులెత్తేశారు. కర్నాటక హైకోర్టు తీర్పు ప్రీ యూనివర్శిటీ కాలేజీలకే పరిమితం అని అంటున్నా.. ముందు జాగ్రత్తగా తాము కూడా హిజాబ్ పై నిషేధం విధించామని అంటున్నారు. ఏబీవీపీ ఆందోళనల వల్లే మంగుళూరు యూనివర్శిటీ హిజాబ్ పై నిషేధం విధించింది. ఇక హిజాబ్ కి అనుమతివ్వాలంటూ, కర్నాటక హైకోర్టు తీర్పుని సవాల్ చేస్తూ ఉడుపి విద్యార్థినులు గతంలో సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఈ కేసు ఇంకా విచారణ దశలోనే ఉంది.

First Published:  30 May 2022 8:10 AM IST
Next Story