మల్లారెడ్డిపై దాడిచేసిన వారిని వదిలిపెట్టం – మంత్రి తలసాని
రెడ్ల సింహగర్జన పేరిట మేడ్చల్ లో జరిగిన సభలో మంత్రి మల్లారెడ్డిపై దాడి జరిగిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పనుల గురించి మంత్రి మాట్లాడుతుండగా.. జనంలో ఉన్న కొందరు మల్లారెడ్డిపై తిరగబడ్డారు. ఆయన వేదిక నుంచి దిగాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆయన కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. కుర్చీలు విసిరేశారు. అయితే ఇదంతా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కుట్ర అని మల్లారెడ్డి ఆరోపించారు. ఆయన మనుషులే తనపై దాడి చేశారని […]
రెడ్ల సింహగర్జన పేరిట మేడ్చల్ లో జరిగిన సభలో మంత్రి మల్లారెడ్డిపై దాడి జరిగిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పనుల గురించి మంత్రి మాట్లాడుతుండగా.. జనంలో ఉన్న కొందరు మల్లారెడ్డిపై తిరగబడ్డారు. ఆయన వేదిక నుంచి దిగాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆయన కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. కుర్చీలు విసిరేశారు. అయితే ఇదంతా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కుట్ర అని మల్లారెడ్డి ఆరోపించారు. ఆయన మనుషులే తనపై దాడి చేశారని పేర్కొన్నారు.
ఇటీవల రేవంత్‌పై మంత్రి మల్లారెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో మేడ్చల్ సభలో మల్లారెడ్డిపై దాడి జరగడం గమనార్హం. ఇదిలా ఉంటే ఈ ఘటనపై తాజాగా మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ స్పందించారు. మంత్రి మల్లారెడ్డిపై దాడి జరగడం సరికాదని, దాడి చేసిన వారు ఎంతవారైనా వదిలిపెట్టేది లేదని పేర్కొన్నారు.
‘తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతోంది. అన్ని కులాలను ముఖ్యమంత్రి కేసీఆర్ సమానంగా చూస్తున్నారు. మేడ్చల్ లో రెడ్డి సింహగర్జనకు అనుమతులు ఇప్పించడం దగ్గర నుంచి సభ ఏర్పాట్ల వరకు మల్లారెడ్డి దగ్గరుండి చూసుకున్నారు. అన్ని చేసిన ఆయనపైనే దాడి చేయడం విచిత్రంగా ఉంది. ఓ మంత్రిగా ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను చెబితే తప్పేంటి? ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతారు. దాడులకు పాల్పడింది ఎంతటివారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు’ అంటూ తలసాని పేర్కొన్నారు.