Telugu Global
NEWS

ఆంధ్ర‌జ్యోతిపై రోజా పోలీస్ కంప్ల‌యింట్‌

మంత్రి రోజా మాటలను వక్రీకరించారంటూ ఆంధ్రజ్యోతి సంస్థతో పాటు మరికొందరిపై వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో శనివారం రోజా మీడియాతో మాట్లాడిన మాటలను వక్రీకరించారన్నది వైసీపీ ఆరోపణ. ”ఎప్పుడో జరిగిన విషయాన్ని, పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా నమోదు కానీ, దిశ యాప్‌ను ఉపయోగించుకోకుండా, ఇంట్లో వారికి కూడా చెప్పకుండా పోయిన విషయాన్ని భూతద్దంలో చూపెడుతున్నారు”అంటూ మంత్రి రోజా విపక్షాలపై విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలకు ఆంధ్రజ్యోతి పత్రిక.. ”ఒకట్రెండు రేప్‌లకే రాద్దాంతామా?” […]

ఆంధ్ర‌జ్యోతిపై రోజా పోలీస్ కంప్ల‌యింట్‌
X

మంత్రి రోజా మాటలను వక్రీకరించారంటూ ఆంధ్రజ్యోతి సంస్థతో పాటు మరికొందరిపై వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో శనివారం రోజా మీడియాతో మాట్లాడిన మాటలను వక్రీకరించారన్నది వైసీపీ ఆరోపణ.

”ఎప్పుడో జరిగిన విషయాన్ని, పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా నమోదు కానీ, దిశ యాప్‌ను ఉపయోగించుకోకుండా, ఇంట్లో వారికి కూడా చెప్పకుండా పోయిన విషయాన్ని భూతద్దంలో చూపెడుతున్నారు”అంటూ మంత్రి రోజా విపక్షాలపై విమర్శలు చేశారు.

ఈ వ్యాఖ్యలకు ఆంధ్రజ్యోతి పత్రిక.. ”ఒకట్రెండు రేప్‌లకే రాద్దాంతామా?” అంటూ రోజా అన్నట్టుగా హెడ్‌లైన్ పెట్టేసింది. ఆ కథనం ఆధారంగా మంత్రి రోజాపై టీడీపీవారు, నెటిజన్లు పెద్దెత్తున ట్రోల్ చేశారు. పత్రిక కథనం ఆధారంగా నెటిజన్లు కూడా రోజాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రోజాను బర్తరఫ్ చేయాలంటూ నగరి టీడీపీ ఇన్‌చార్జ్ గాలి భానుప్రకాశ్ డిమాండ్ చేశారు.

రోజా వ్యాఖ్యలను వక్రీకరించిన వారిపైనా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపైనా కేసు నమోదు చేయాలని వైసీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాకపోతే ఆంధ్రజ్యోతి పత్రికకు ఇలా వైసీపీ నేతలు.. కేసులు, పరువు నష్టం దావాలు అంటూ వార్నింగ్‌లు ఇవ్వడం ఇప్పటికే వందలసార్లు జరిగింది. కానీ ఏమీ చేయలేకపోయారన్నది కూడా నిజం.

First Published:  30 May 2022 2:22 AM IST
Next Story