దాడి వెనుక రేవంత్ రెడ్డి..
తెలంగాణ మంత్రి మల్లారెడ్డిపై రెడ్డి సింహగర్జన సభలో దాడి జరగడం ఇప్పుడు దుమారం రేపుతోంది. ఈ దాడికి రెడ్డి సంఘానికి సంబంధం లేదని మంత్రి మల్లారెడ్డి చెబుతున్నారు. తనపై దాడి కుట్ర ముమ్మాటికీ రేవంత్ రెడ్డిదేనని ఆయన ఆరోపించారు. కొద్దిరోజుల క్రితం రేవంత్ రెడ్డికి, మల్లారెడ్డికి మధ్య మాటల యుద్ధం నడిచింది. కొద్దిరోజుల క్రితం కర్నాటకలో జరిగిన రెడ్డి సంఘం సమావేశంలో ప్రసంగించిన రేవంత్ రెడ్డి.. వెలమకు, రెడ్లకు తొలి నుంచి పొసగదని వ్యాఖ్యానించారు. దాంతో టీఆర్‌ఎస్‌లోని […]
తెలంగాణ మంత్రి మల్లారెడ్డిపై రెడ్డి సింహగర్జన సభలో దాడి జరగడం ఇప్పుడు దుమారం రేపుతోంది. ఈ దాడికి రెడ్డి సంఘానికి సంబంధం లేదని మంత్రి మల్లారెడ్డి చెబుతున్నారు. తనపై దాడి కుట్ర ముమ్మాటికీ రేవంత్ రెడ్డిదేనని ఆయన ఆరోపించారు. కొద్దిరోజుల క్రితం రేవంత్ రెడ్డికి, మల్లారెడ్డికి మధ్య మాటల యుద్ధం నడిచింది. కొద్దిరోజుల క్రితం కర్నాటకలో జరిగిన రెడ్డి సంఘం సమావేశంలో ప్రసంగించిన రేవంత్ రెడ్డి.. వెలమకు, రెడ్లకు తొలి నుంచి పొసగదని వ్యాఖ్యానించారు. దాంతో టీఆర్‌ఎస్‌లోని రెడ్లంతా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. వారిలో మల్లారెడ్డీ ఉన్నారు. రేవంత్ రెడ్డి ఒక పెద్ద బ్లాక్ మెయిలర్ అని.. తాను ఇచ్చిన డబ్బులతోనే బిడ్డకు పెళ్లి చేశారని మల్లారెడ్డి ఆరోపించారు.
అలా తాను రేవంత్ రెడ్డిపై చేసిన మాటలకు ప్రతీకారంగానే తనపై రెడ్డి సింహ గర్జన సభలో దాడి చేయించారని మల్లారెడ్డి చెబుతున్నారు. రేవంత్ రెడ్డి వంద మంది గూండాలను ముందే సిద్ధం చేసి తనపై దాడి చేయించారని ఆరోపించారు. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు గురించి తాను చెబుతున్నా సరే వినిపించుకోకుండా వాగ్వాదానికి వచ్చారని, వారంతా రేవంత్ రెడ్డి మనుషులేనని విమర్శించారు. కొద్ది రోజుల క్రితం తనకు రేవంత్ రెడ్డికి మధ్య గొడవ నడిచింది కదా దాని వల్లే ఈ దాడికి కుట్ర చేశారని ఆయన చెబుతున్నారు.
తాను మాట్లాడిన దాంట్లో తప్పేంటని ప్రశ్నించారు. 70ఏళ్లలో ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారని, వారిలో రెడ్లు కూడా ఉన్నారని.. కానీ వారు ఏనాడు రెడ్డి కార్పొరేషన్ ఆలోచన కూడా చేయలేదన్నారు. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని టీఆర్‌ఎస్ మేనిఫెస్టోలో పెట్టిందంటే దాని అర్థం .. కార్పొరేషన్ ఏర్పాటు ఆలోచన ఉన్నట్టే కదా అని మల్లారెడ్డి ప్రశ్నించారు. సభకు వచ్చిన వారిలోనూ ఎక్కువ మంది మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలకు చెందిన వారేనని మల్లారెడ్డి చెబుతున్నారు.