పుతిన్ మూడేళ్ళ లోపే చనిపోతాడా ?
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కేవలం ఇంకా మూడేళ్లు మాత్రమే జీవిస్తారా ? క్యాన్సర్ వల్ల అతని ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందా ? ఆయన కంటి చూపు వేగంగా కోల్పోతున్నారా ? ఈ ప్రశ్నలన్నిటికీ వెస్ట్రన్ మీడియా అవుననే సమాధానాలు చెబుతోంది. 69 ఏళ్ళ పుతిన్ చాలా కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నారని, అతని ఆరోగ్యం రోజు రోజుకూ క్షీణిస్తోందని రష్యా వైద్యులను ఉటంకిస్తూ వార్తలు వచ్చాయి. ఎఫ్‌ఎస్‌బీ (Federal Security Service) అధికారి బోరిస్ కార్పిచ్కోవ్ […]
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కేవలం ఇంకా మూడేళ్లు మాత్రమే జీవిస్తారా ? క్యాన్సర్ వల్ల అతని ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందా ? ఆయన కంటి చూపు వేగంగా కోల్పోతున్నారా ? ఈ ప్రశ్నలన్నిటికీ వెస్ట్రన్ మీడియా అవుననే సమాధానాలు చెబుతోంది.
69 ఏళ్ళ పుతిన్ చాలా కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నారని, అతని ఆరోగ్యం రోజు రోజుకూ క్షీణిస్తోందని రష్యా వైద్యులను ఉటంకిస్తూ వార్తలు వచ్చాయి. ఎఫ్‌ఎస్‌బీ (Federal Security Service) అధికారి బోరిస్ కార్పిచ్కోవ్ చెప్పినట్టు వస్తున్న కథనాల ప్రకారం… “పుతిన్ కు ఎక్కువ సమయం లేదు.రెండు నుండి మూడు సంవత్సరాల కంటే ఎక్కువ సమయం అతను బతకలేడు” అని బోరిస్ చెప్పినట్టు కథనాలు వచ్చాయి.
అతను చెప్పిన ప్రకారం పుతిన్ తన కంటి చూపును కోల్పోతున్నాడు. ఇప్పటికే ఆయన సరిగా చూడలేకపోతున్నారు. టీవీల్లో మాట్లాడేటప్పుడు పేపర్ల మీద పెద్ద అక్షరాలు రాసివ్వాల్సి వస్తోంది. తనకు కంటి చూపు పోయిందనే విషయం బైటికి తెలియకుండా ఉండేందుకు ఆయన కంటి అద్దాలు పెట్టుకోవడానికి కూడా నిరాకరిస్తున్నారు. పైగా అతను తీవ్ర తలనొప్పితో బాధపడుతున్నారు.
పుతిన్ శరీరం కూడా సరిగా సహకరించడంలేదు. శరీరం విపరీతంగా వణుకుతోంది. సమావేశాల్లో పాల్గొన్నప్పుడు సమావేశం పూర్తవకుండానే ఆయన వెళ్ళిపోతున్నారు. అధికారులతో అసహనంగా ప్రవర్తిస్తున్నారు. తన కింద పనిచేసే సిబ్బందిపై చీటికీమాటికీ కోపగించుకుంటున్నారని సదరు అధికారి చెప్పినట్టు కథనాలు వెలువడ్డాయి.
అమెరికాకు చెందిన న్యూ లైన్స్ మ్యాగజైన్ కథనం ప్రకారం, ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై దాడికి ఆదేశించడానికి కొద్దిసేపటి ముందు పుతిన్ కు వెన్ను శస్త్రచికిత్స జరిగింది.
అయితే ఈ కథనాలన్నింటినీ రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ కొట్టిపడేశారు. ఇవన్నీ అబద్దపు ప్రచారాలు అని ఆయన అన్నారు. పుతిన్ సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉన్నాడని, ఎలాంటి వ్యాధి లక్షణాలు లేవని తెలిపాడు. విచక్షణ ఉన్నవాడెవడూ ఇలా అబద్దపు ప్రచారాలు చేయడు అంటూ పుతిన్ అనారోగ్య కథనాలపై ఘాటుగా స్పందించారు సెర్గీ లావ్‌రోవ్ .