Telugu Global
NEWS

ఐపీఎల్ నయా చాంపియన్ గుజరాత్ టైటాన్స్ ఫైనల్లో తేలిపోయిన రాయల్స్

టాటా ఐపీఎల్ 15వ సీజన్ టైటిల్ ను గెలుచుకోడం ద్వారా గుజరాత్ టైటాన్స్ సరికొత్త చరిత్ర సృష్టించింది. అరంగేట్రం సీజన్లోనే అంచనాలను మించి రాణించడ ద్వారా సత్తా చాటుకొంది.మొత్తం 10 జట్లు, 70 మ్యాచ్ లు, 7 వారాల ఈ లీగ్ పోరులో తొలిరౌండ్ నుంచి టైటిల్ సమరం వరకూ గుజరాత్ టైటాన్స్ నిలకడగా రాణించడం ద్వారా అత్యుత్తమజట్టుగా నిలిచింది. లీగ్ దశలో 14 రౌండ్లలో 10 విజయాలతో 20 పాయింట్లు సాధించడం ద్వారా టాపర్ గా […]

ఐపీఎల్ నయా చాంపియన్ గుజరాత్ టైటాన్స్ ఫైనల్లో తేలిపోయిన రాయల్స్
X

టాటా ఐపీఎల్ 15వ సీజన్ టైటిల్ ను గెలుచుకోడం ద్వారా గుజరాత్ టైటాన్స్ సరికొత్త చరిత్ర సృష్టించింది. అరంగేట్రం సీజన్లోనే అంచనాలను మించి రాణించడ ద్వారా సత్తా చాటుకొంది.మొత్తం 10 జట్లు, 70 మ్యాచ్ లు, 7 వారాల ఈ లీగ్ పోరులో తొలిరౌండ్ నుంచి టైటిల్ సమరం వరకూ గుజరాత్ టైటాన్స్ నిలకడగా రాణించడం ద్వారా అత్యుత్తమజట్టుగా నిలిచింది.

లీగ్ దశలో 14 రౌండ్లలో 10 విజయాలతో 20 పాయింట్లు సాధించడం ద్వారా టాపర్ గా నిలవడమే కాదు..క్వాలిఫైయర్ తొలి పోరులోనే రాజస్దాన్ రాయల్స్ ను అలవోకగా ఓడించిన గుజతాత్ టైటాన్స్..ఫైనల్లో సైతం ఏకపక్ష విజయమే సాధించింది.

ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా నాయత్వంలోని గుజరాత్ టైటాన్స్ కు రాజస్థాన్ రాయల్స్ ఫైనల్లో సమఉజ్జీ కాలేకపోయింది. ఓపెనర్ శుభ్ మన్ గిల్, లెగ్ స్పిన్ జాదూ రషీద్ ఖాన్, కిల్లర్ మిల్లర్ , లిటిల్ వండర్ వృద్ధిమాన్ సాహా లాంటి కీలక ఆటగాళ్ల ప్రతిభతో గుజరాత్ టైటాన్స్ చెలరేగిపోయింది.

టైటాన్స్ కు 20 కోట్ల నజరానా..

ఐపీఎల్ ట్రోఫీని తొలి ప్రయత్నంలోనే నెగ్గడం ద్వారా గుజరాత్ టైటాన్స్ 20 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ అందుకొంది. గత 15 సీజన్ల చరిత్రలో

ఐపీఎల్‌ ట్రోఫీని అందుకున్న 7వ జట్టుగా రికార్డుల్లో చేరింది.

ఇంతకు ముందు టైటిల్ సాధించిన జట్లలో ముంబై ఇండియన్స్ (2013, 2015, 2017, 2019, 2020) .. చెన్నై సూపర్ కింగ్స్ (2010, 2011, 2018, 2021) , కోల్‌కతా నైట్ రైడర్స్ (2012, 2014) .. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (2016), రాజస్థాన్‌ రాయల్స్‌ (2008), డక్కన్‌ చార్జర్స్‌ (2009) విజేతలుగా ఉన్నాయి. ప్రస్తుత టోర్నీ ద్వారా ఈ దిగ్గజ జట్ల వరుసలో గుజరాత్ టైటాన్స్ నిలిచింది.

ఫైనల్లో రెండో అత్యల్పస్కోరు…

ఐపీఎల్ ఫైనల్స్ లో రెండో అతితక్కువ స్కోరుతో ముగిసిన మ్యాచ్ గా ప్రస్తుత సీజన్ టోర్నీ రికార్డుల్లో చేరింది.

ఐపీఎల్‌ ఫైనల్స్‌లో ఇది (130/9) రెండో అత్యల్ప స్కోరు. 2017లో రైజింగ్‌ పుణె సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన తుదిపోరులో ముంబై 129 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకొని టైటిల్‌ గెలుచుకోవడం విశేషం.
అయితే…ప్రస్తుత సీజన్లో అత్యంత వేగవంతమైన బంతిని విసిరిన బౌలర్ గా గుజరాత్ టైటాన్స్ ఫాస్ట్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

సన్ రైజర్స్ హైదరాబాద్ యువఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ పేరుతో ఉన్న గంటకు 157 కిలోమీటర్ల రికార్డును లాకీ ఫెర్గూసన్ 157.3 కిలోమీటర్ల వేగంతో అధిగమించాడు.

ఫైనల్లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ పైన ఈ అత్యంత వేగవంతమైన యార్కర్ ను లాకీ ఫెర్గూసన్ సధించాడు.

మొత్తం మీద..కరోనా దెబ్బతో గత రెండుసీజన్లుగా అతలాకుతులమైన ఐపీఎల్ ప్రస్తుత సీజన్లో మాత్రం..10 జట్లు, 70 మ్యాచ్ ల హంగామాతో…పలు సరికొత్త రికార్డులు, సంచలనాలతో ముగియటం విశేషం.

ఐపీఎల్‌ ఒకే సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా బట్లర్‌ (863) నిలిచాడు. విరాట్‌ కోహ్లీ (973; 2016వ సీజన్‌) అగ్రస్థానంలో ఉన్నాడు.

First Published:  30 May 2022 1:50 AM IST
Next Story