Telugu Global
CRIME

రైతు నాయకుడు రాకేష్ తికాయత్ పై ఇంక్ దాడి

రైతు నేత, భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు రాకేష్ తికాయత్ పై కర్నాటకలో ఇంక్ దాడి జరిగింది. మీడియా సమావేశంలో మాట్లాడుతున్న తికాయత్, అతని సహచరుడు యుధ్వీర్ సింగ్‌లపై కొందరు ఇంక్ చల్లారు. ఇటీవల కర్నాటక రైతు నాయకుడు కోడిహళ్లి చంద్రశేకర్‌ డబ్బులు లంచం అడగుతుండ‌గా ఓ ప్రాంతీయ ఛానెల్‌ స్టింగ్‌ ఆపరేషన్ చేసి బైట పెట్టింది. ఆ వీడియోపై రాకేష్ తికాయత్ క్లారిటీ ఇస్తుండగా ఈ దాడి జరిగింది. ఆ సంఘటనలో తమ ప్రమేయం లేదని, […]

రైతు నాయకుడు రాకేష్ తికాయత్ పై ఇంక్ దాడి
X

రైతు నేత, భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు రాకేష్ తికాయత్ పై కర్నాటకలో ఇంక్ దాడి జరిగింది. మీడియా సమావేశంలో మాట్లాడుతున్న తికాయత్, అతని సహచరుడు యుధ్వీర్ సింగ్‌లపై కొందరు ఇంక్ చల్లారు.

ఇటీవల కర్నాటక రైతు నాయకుడు కోడిహళ్లి చంద్రశేకర్‌ డబ్బులు లంచం అడగుతుండ‌గా ఓ ప్రాంతీయ ఛానెల్‌ స్టింగ్‌ ఆపరేషన్ చేసి బైట పెట్టింది. ఆ వీడియోపై రాకేష్ తికాయత్ క్లారిటీ ఇస్తుండగా ఈ దాడి జరిగింది. ఆ సంఘటనలో తమ ప్రమేయం లేదని, కోడిహళ్లి చంద్రశేఖర్‌పై చర్యలు తీసుకోవాలని తికాయత్ స్పష్టం చేశారు. దాంతో కొంతమంది అతనితో వాగ్వివాదానికి దిగారు. ఆ పై రాకేష్ తికైత్, యుధ్వీర్ సింగ్‌లపై నల్ల ఇంకు చల్లి కుర్చీలు కూడా విసిరారు.

కాగా రైతు నాయకుడు చంద్రశేఖర్ మద్దతుదారులే తమపై సిరా విసిరారని, . ఈ కార్యక్రమానికి బెంగళూరు పోలీసులు ఎలాంటి భద్రత కల్పించలేదని తికాయత్ ఆరోపించారు.

“ఇక్కడ స్థానిక పోలీసులు ఎటువంటి భద్రత కల్పించలేదు. బిజెపిప్రభుత్వంతో చంద్రశేఖర్ కుమ్మక్కయ్యి చేసిన చర్య‌” అని తికాయ‌త్ అన్నారు.

మరో వైపు తికాయత్ పై నల్ల ఇంక్ చల్లిన‌ ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు హై గ్రౌండ్స్ పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు.

కేంద్రం తీసుకవచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ స‌రిహద్దుల్లో ఏడాది పాటు రైతులు చేసిన పోరాటం స‍ందర్భ‍ంగా రాకేష్ తికాయత్ దేశవ్యాప్తంగా పరిచయమయ్యారు. ఆయన బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్త ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన నాయకత్వం వహిస్తున్న భారతీయ కిసాన్ యూనియన్ నుంచి రాజేష్ చౌహాన్ అనే రైతు నాయకుడి నేత్రుత్వంలో ఓ సమూహం విడి పోయి తమదే అసలైన బీకేయూ అని ప్రకటించింది.

First Published:  30 May 2022 3:51 AM GMT
Next Story