Telugu Global
NEWS

ఉద్యోగాలంటూ డబ్బులు వసూలు చేసి.. చివరకు బోర్డు తిప్పేసిన సాఫ్ట్‌వేర్ కంపెనీ

ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ సాఫ్ట్‌వేర్ జాబ్‌కు ఉన్న క్రేజే వేరు. తెలంగాణ, ఏపీకి చెందిన ఇంజినీర్లే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కూడా హైదరాబాద్ చేరుకొని ఇక్కడ శిక్షణ పొంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తుంటారు. అలాంటి కొంత మంది నిరుద్యోగులను ఉద్యోగాల పేరిట మోసం చేసిందో సాఫ్ట్‌వేర్ కంపెనీ. ఉద్యోగాలు ఇస్తామంటూ చెప్పి దాదాపు రూ. 20 కోట్ల వరకు వసూలు చేసిన తర్వాత బోర్డు తిప్పేసింది ఒక సంస్థ. హైదరాబాద్‌లోని మాదాపూర్‌కు చెందిన […]

ఉద్యోగాలంటూ డబ్బులు వసూలు చేసి.. చివరకు బోర్డు తిప్పేసిన సాఫ్ట్‌వేర్ కంపెనీ
X

ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ సాఫ్ట్‌వేర్ జాబ్‌కు ఉన్న క్రేజే వేరు. తెలంగాణ, ఏపీకి చెందిన ఇంజినీర్లే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కూడా హైదరాబాద్ చేరుకొని ఇక్కడ శిక్షణ పొంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తుంటారు. అలాంటి కొంత మంది నిరుద్యోగులను ఉద్యోగాల పేరిట మోసం చేసిందో సాఫ్ట్‌వేర్ కంపెనీ. ఉద్యోగాలు ఇస్తామంటూ చెప్పి దాదాపు రూ. 20 కోట్ల వరకు వసూలు చేసిన తర్వాత బోర్డు తిప్పేసింది ఒక సంస్థ.

హైదరాబాద్‌లోని మాదాపూర్‌కు చెందిన ఇన్నోహబ్ టెక్నాలజీస్ సంస్థ సాఫ్ట్‌వేర్ జాబ్స్ ఇప్పిస్తామంటూ చాలా మంది దగ్గర రూ. 2 లక్షల చొప్పున వసూలు చేసింది. ఈ విధంగా రూ. 20 కోట్లు వసూలు చేసి రెండు నెలలు శిక్షణ ఇచ్చింది. ఆ తర్వాత జాబ్ ఇచ్చినట్లు చెప్పి జీతాలు కూడా చెల్లించింది. అయితే అకస్మాత్తుగా కంపెనీ బోర్డు తిప్పేసింది. సంస్థకు చెందిన అఫీషియల్ మెయిల్ ఐడీతో పాటు వెబ్‌సైట్ బ్లాక్ చేసింది.

దీంతో ఒక్కసారిగా ఖంగుతిన్న ఉద్యోగులు కంపెనీ వద్దకు వెళ్లి చూడగా అక్కడ కనీసం బోర్డు కూడా లేదు. ఈ సంస్థ ఉచ్చులో దాదాపు 800 మంది నిరుద్యోగులు పడ్డట్లు తెలుస్తుంది. మోసపోయిన నిరుద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేసి వారం గడుస్తున్నా.. ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ క్రమంలో సోమవారం బాధితులంతా మాధాపూర్ పీఎస్ ఎదుట ఆందోళన చేపట్టారు. కాగా, ఈ విషయంపై త్వరలోనే చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు.

First Published:  30 May 2022 12:45 PM IST
Next Story