Telugu Global
Cinema & Entertainment

మేజర్ బయోపిక్ ఆలోచన ఎలా వచ్చింది?

26/11 దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితంపై సినిమా తీయాలని చాలా మంది అనుకున్నారు. కానీ అ అవకాశం అడివి శేష్ కు దక్కింది. సందీప్ తల్లిదండ్రులు శేష్ కు మాత్రమే ఆ ఛాన్స్ ఇచ్చారు. ఇంతకీ ఈ సినిమా తీయాలనే ఆలోచన శేష్ కు ఎలా వచ్చింది. “26/11 ఘ‌ట‌న‌లు జ‌రిగాక ఆయ‌న ఫొటోలు బ‌య‌ట‌కు వ‌చ్చాక మా క‌జిన్ ప‌వ‌న్, నాకూ సందీప్‌కు పోలిక‌లు ఉన్న‌ాయ‌ని చెప్పాడు. వందలాది మంది ప్రాణాలు […]

adivi sesh
X

26/11 దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితంపై సినిమా తీయాలని చాలా మంది అనుకున్నారు. కానీ అ అవకాశం అడివి శేష్ కు దక్కింది. సందీప్ తల్లిదండ్రులు శేష్ కు మాత్రమే ఆ ఛాన్స్ ఇచ్చారు. ఇంతకీ ఈ సినిమా తీయాలనే ఆలోచన శేష్ కు ఎలా వచ్చింది.

“26/11 ఘ‌ట‌న‌లు జ‌రిగాక ఆయ‌న ఫొటోలు బ‌య‌ట‌కు వ‌చ్చాక మా క‌జిన్ ప‌వ‌న్, నాకూ సందీప్‌కు పోలిక‌లు ఉన్న‌ాయ‌ని చెప్పాడు. వందలాది మంది ప్రాణాలు కాపాడిన ఆయ‌న‌కు అశోక్ చ‌క్ర వ‌చ్చిన‌ప్పుడు ఆయ‌న గురించి చ‌దివి ఆయ‌న‌కు ఫ్యాన్ అయ్యాను. ఆయ‌న నిజ‌జీవితంలో జ‌రిగిన విష‌యాలు ఎవ‌రికీ తెలీవు. హోట‌ల్‌లో 36 గంట‌లు ఏం చేశాడ‌నేది తెలుసు. కానీ 31 సంవ‌త్స‌రాల‌లో ఆయ‌న జీవితం ఎలా ఉంద‌నేది ఎవ‌రికీ తెలీదు. ఇవ‌న్నీ నేను తెలుసుకున్నాక ఆయ‌న లైఫ్ గురించి ఎందుకు చెప్ప‌కూడ‌ద‌నే ఆలోచ‌న వ‌చ్చింది. క్ష‌ణం సినిమా టైంలో ఆలోచ‌న స్టార్ట్ అయింది. గూఢచారి టైంలో స్పీడ్ అందుకుంది.”

ఇలా మేజర్ బయోపిక్ ఐడియాను బయటపెట్టాడు అడివి శేష్. అప్పటికే ఆ బయోపిక్ తీయడానికి వచ్చిన చాలామంది ప్రతిపాదనల్ని సందీప్ తల్లిదండ్రులు తిరస్కరించారు. వీటిలో బాలీవుడ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. బహుశా సినిమాగా రావడం వాళ్లకు ఇష్టం లేదేమో అనే ఆలోచనతో వెళ్లి కలిశాడట శేష్. అతడ్ని చూడగానే సందీప్ ను చూసిన ఫీలింగ్ కలిగింది ఆ తల్లిదండ్రులకి. అందుకే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

First Published:  30 May 2022 1:34 AM IST
Next Story