Telugu Global
NEWS

బట్లర్ కు ఆరెంజ్…చహాల్ కు పర్పుల్ ఐపీఎల్-15లో అదరగొట్టిన రాయల్స్ జోడీ

ఐపీఎల్ 15వ సీజన్ టైటిల్ ను చేజిక్కించుకోడంలో మాజీ చాంపియన్ రాజస్థాన్ రాయల్స్ విఫలమైనా..అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ కు ఇచ్చే ఆరెంజ్ క్యాప్, అత్యధిక వికె్ట్లు పడగొట్టిన బౌలర్ కు ఇచ్చే పర్పుల్ క్యాప్ అవార్డులను రాయల్స్ జోడీ జోస్ బట్లర్, యుజవేంద్ర చహాల్ గెలుచుకొన్నారు. అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ తో ముగిసిన టైటిల్ సమరంలో రాజస్థాన్ రాయల్స్ 7 వికెట్ల పరాజయం తో రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. […]

బట్లర్ కు ఆరెంజ్…చహాల్ కు పర్పుల్ ఐపీఎల్-15లో అదరగొట్టిన రాయల్స్ జోడీ
X

ఐపీఎల్ 15వ సీజన్ టైటిల్ ను చేజిక్కించుకోడంలో మాజీ చాంపియన్ రాజస్థాన్ రాయల్స్ విఫలమైనా..అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ కు ఇచ్చే ఆరెంజ్ క్యాప్, అత్యధిక వికె్ట్లు పడగొట్టిన బౌలర్ కు ఇచ్చే పర్పుల్ క్యాప్ అవార్డులను రాయల్స్ జోడీ జోస్ బట్లర్, యుజవేంద్ర చహాల్ గెలుచుకొన్నారు.

అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ తో ముగిసిన టైటిల్ సమరంలో రాజస్థాన్ రాయల్స్ 7 వికెట్ల పరాజయం తో రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
అయితే…రాయల్స్ డాషింగ్ ఓపెనర్ జోస్ బట్లర్ 17 మ్యాచ్ ల్లో 4 శతకాలతో సహా 863 పరుగులు సాధించడం ద్వారా అత్యుత్తమ బ్యాటర్ గా నిలిచాడు.

ఆరెంజ్ క్యాప్ పురస్కారంతో పాటు 15 లక్షల రూపాయల ప్రైజ్ మనీ అందుకొన్నాడు.
ఐపీఎల్ 15 సీజన్ల చరిత్రలోనే 2016 సీజన్లో విరాట్ కొహ్లీ 900కు పైగా పరుగులు సాధించడం ద్వారా అగ్రస్థానంలో నిలిస్తే…బట్లర్ 863 పరుగులతో రెండోస్థానంలో కొనసాగుతున్నాడు.

ప్రస్తుత టోర్నీలో బట్లర్ తర్వాతి స్థానంలో నిలిచిన ఇతర బ్యాటర్లలో కెఎల్ రాహుల్ ( 15 మ్యాచ్ ల్లో 616 పరుగులు ), క్వింటన్ డి కాక్ ( 15 మ్యాచ్ ల్లో 508 పరుగులు ), హార్ధిక్ పాండ్యా ( 15 మ్యాచ్ ల్లో 487 పరుగులు ), శుభ్ మన్ గిల్ ( 16 మ్యాచ్ ల్లో 483 పరుగులు ) డేవిడ్ మిల్లర్ ( 16 మ్యాచ్ ల్లో 481 పరుగులు ) ఉన్నారు.

చహాల్ సరికొత్త రికార్డు…..

అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ కు ఇచ్చే పర్పుల్ క్యాప్ ను లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహాల్ అందుకొన్నాడు. మొత్తం 17 మ్యాచ్ ల్లో చహాల్ 27 వికెట్లు పడగొట్టడం ద్వారా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఇప్పటి వరకూ ఇమ్రాన్ తాహీర్ పేరుతో ఉన్న 26 వికెట్ల ఐపీఎల్ రికార్డును అధిగమించాడు.
ఆరెంజ్ క్యాప్ తో పాటు చహాల్ 15 లక్షల రూపాయల ప్రైజ్ మనీ సైతం సొంతం చేసుకొన్నాడు.
గుజరాత్ టైటాన్స్ తో ముగిసిన ఐపీఎల్ ఫైనల్లో చహాల్ ఒకే ఒక్క వికెట్ పడగొట్టడం ద్వారా తన వికెట్ల సంఖ్యను 27కు పెంచుకొన్నాడు. గత సీజన్ వరకూ బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టులో కీలక సభ్యుడుగా ఉన్న చహాల్ ను 2022 మెగా వేలం ద్వారా 6 కోట్ల 50 లక్షల రూపాయల ధరకు జైపూర్ ఫ్రాంచైజీ ఖాయం చేసుకొంది.

ప్రస్తుత 15వ సీజన్ అత్యుత్తమ బౌలర్ల వరుసలో చహాల్ అగ్రస్థానంలో నిలిస్తే…బెంగళూరు లెగ్ స్పిన్నర్ వనిందు హసరంగ (16 మ్యాచ్ ల్లో 26 వికెట్లు ), కగీసో రబాడా ( 13 మ్యాచ్ ల్లో 23 వికెట్లు ), ఉమ్రాన్ మాలిక్ ( 14 మ్యాచ్ ల్లో 22 వికెట్లు 0, కుల్దీప్ యాదవ్ ( 14 మ్యాచ్ ల్లో 21 వికెట్లు ), మహ్మద్ షమీ ( 16 మ్యాచ్ ల్లో 20 వికె్ట్లు ), జోష్ హేజిల్ వుడ్ ( 12 మ్యాచ్ ల్లో 20 వికెట్లు ), రషీద్ ఖాన్ ( 16 మ్యాచ్ ల్లో 19 వికెట్లు ), హర్షల్ పటేల్ ( 15 మ్యాచ్ ల్లో 19 వికెట్లు ), ప్రసిద్ధ కృష్ణ ( 17 మ్యాచ్ ల్లో 19 వికెట్లు ) ఉన్నారు.
మొత్తం మీద లెగ్ స్పిన్ బౌలర్లే తమతమ జట్ల తరపున మ్యాచ్ విన్నర్లుగా నిలువగలిగారు.

Chahal to Purple

First Published:  30 May 2022 2:30 AM IST
Next Story