పల్నాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి, 15 మందికి తీవ్రగాయాలు
పల్నాడులోని రెంటచింతల రహదారి రక్తసిక్తమైంది. ఆగి ఉన్న లారీని మినీ వ్యాన్ ఢీకొట్టడంతో ఏడుగురు మృతిచెందగా.. 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో మృతిచెందిన వారు, గాయపడ్డవారంతా వ్యవసాయ కూలీలే. రెంటచింతలలోని వడ్డెరబావికి చెందిన 38 మంది వ్యవసాయ కూలీలు .. ఆదివారం మినీ వ్యాన్ లో శ్రీశైలం వెళ్లారు. దర్శనానంతరం తిరిగి స్వగ్రామానికి వస్తుండగా రెంటచింతల విద్యుత్ కార్యాలయం వద్ద అర్ధరాత్రి వీరు ప్రయాణిస్తున్న మినీ వ్యాన్ .. ఆగిఉన్న లారీని ఢీకొట్టింది. ఈ […]
పల్నాడులోని రెంటచింతల రహదారి రక్తసిక్తమైంది. ఆగి ఉన్న లారీని మినీ వ్యాన్ ఢీకొట్టడంతో ఏడుగురు మృతిచెందగా.. 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో మృతిచెందిన వారు, గాయపడ్డవారంతా వ్యవసాయ కూలీలే. రెంటచింతలలోని వడ్డెరబావికి చెందిన 38 మంది వ్యవసాయ కూలీలు .. ఆదివారం మినీ వ్యాన్ లో శ్రీశైలం వెళ్లారు. దర్శనానంతరం తిరిగి స్వగ్రామానికి వస్తుండగా రెంటచింతల విద్యుత్ కార్యాలయం వద్ద అర్ధరాత్రి వీరు ప్రయాణిస్తున్న మినీ వ్యాన్ .. ఆగిఉన్న లారీని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ముగ్గురిని ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. చిన్న పాటి వ్యాన్ లో 38 మంది కిక్కిరిసి వెళ్లారు. మినీ వ్యాన్ ఆగిఉన్న లారీని ఢీకొట్టి బోల్తాపడటంతో వీరంతా ఒకరిమీద ఒకరు పడి.. ఊపిరాడక మృతిచెందినట్టు సమాచారం.
డ్రైవర్ నిర్లక్ష్యం కూడా ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. గాయపడ్డవారిని గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. మరి కొద్ది సేపట్లో ఇంటికి చేరుకుంటారనగా జరిగిన ప్రమాదంలో ఒకే గ్రామానికి చెందిన ఏడుగురు మృతిచెందడం, 15 మందికి తీవ్ర గాయాలు కావడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.