Telugu Global
NEWS

నెలకు 3వేలు, సిలిండర్‌ ఫ్రీ, పించన్ వయసు 50ఏళ్లు

సంక్షేమ పథకాలు ఎక్కువైపోయి ఇతర అభివృద్ధి పనులకు నిధులు కేటాయించలేకపోతున్నామని స్వయంగా మంత్రులే పరోక్షంగా అంగీకరిస్తుంటే.. ఈ పథకాలు సరిపోవు మరిన్ని తీసుకురావాలంటున్నారు కాపు నేత చేగొండి హరిరామజోగయ్య. నవరత్నాలు లాంటి పథకాలను మరిన్ని తీసుకురావాలని కోరారు. నిత్యావసర సరుకులు కొనుగోలు చేయలేని వారికి నెలకు మూడు వేల రూపాయలు, రెండు నెలలకు ఒక గ్యాస్ సిలిండర్ ఉచితంగా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. విదేశాలకు వెళ్లే కాపు విద్యార్థులకు ప్రభుత్వమే ఆర్థిక సాయం చేయాలని విజ్ఞప్తి […]

నెలకు 3వేలు, సిలిండర్‌ ఫ్రీ, పించన్ వయసు 50ఏళ్లు
X

సంక్షేమ పథకాలు ఎక్కువైపోయి ఇతర అభివృద్ధి పనులకు నిధులు కేటాయించలేకపోతున్నామని స్వయంగా మంత్రులే పరోక్షంగా అంగీకరిస్తుంటే.. ఈ పథకాలు సరిపోవు మరిన్ని తీసుకురావాలంటున్నారు కాపు నేత చేగొండి హరిరామజోగయ్య. నవరత్నాలు లాంటి పథకాలను మరిన్ని తీసుకురావాలని కోరారు.

నిత్యావసర సరుకులు కొనుగోలు చేయలేని వారికి నెలకు మూడు వేల రూపాయలు, రెండు నెలలకు ఒక గ్యాస్ సిలిండర్ ఉచితంగా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. విదేశాలకు వెళ్లే కాపు విద్యార్థులకు ప్రభుత్వమే ఆర్థిక సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం 60ఏళ్లుగా ఉన్న పించన్‌ వయసును 50ఏళ్లకు తగ్గించాలని కూడా జోగయ్య సూచించారు.

నదీ జలాలను శుద్ది చేసి నేరుగా గ్రామాలు, పట్టణాలకు మంచినీరుగా అందించాలన్నారు. గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థను రోడ్లను బాగు చేయాలని కోరారు. ఈ డిమాండ్లన్నింటిని జనసేన పార్టీ తన మేనిఫెస్టోలో చేర్చాలని కూడా హరిరామజోగయ్య విజ్ఞప్తి చేశారు.

ALSO READ: దాడి వెనుక రేవంత్ రెడ్డి..

First Published:  30 May 2022 5:22 AM IST
Next Story