Telugu Global
National

భారత్ లో 10 లక్షల మంది దొంగ డాక్టర్లు.. ఎలా గుర్తు పట్టాలంటే..?

వైద్యం కోసం ఆస్పత్రికి వెళ్తే బయట బోర్డుమీద డాక్టర్ పేరు వెనక డిగ్రీ ఏముందని చూస్తారు కానీ, అది అసలా, నకిలీనా అనేది ఎవరూ ఎంక్వయిరీ చేయరు. పైకి అన్ని పర్మిషన్లు ఉన్నట్టే కనిపించినా, లోపల సర్టిఫికెట్ కాపీని ఫ్రేమ్ కట్టి గోడకి తగిలించినా ఎవరికీ పెద్దగా అనుమానం ఉండదు. అలా ఇప్పటి వరకు భారత్ లో 10లక్షలమంది దొంగ డాక్టర్లు.. అసలు డాక్టర్ల కంటే ఘనంగా చలామణి అయిపోతున్నారు. వీరిలో దాదాపు 6 లక్షలమంది అల్లోపతి […]

భారత్ లో 10 లక్షల మంది దొంగ డాక్టర్లు.. ఎలా గుర్తు పట్టాలంటే..?
X

వైద్యం కోసం ఆస్పత్రికి వెళ్తే బయట బోర్డుమీద డాక్టర్ పేరు వెనక డిగ్రీ ఏముందని చూస్తారు కానీ, అది అసలా, నకిలీనా అనేది ఎవరూ ఎంక్వయిరీ చేయరు. పైకి అన్ని పర్మిషన్లు ఉన్నట్టే కనిపించినా, లోపల సర్టిఫికెట్ కాపీని ఫ్రేమ్ కట్టి గోడకి తగిలించినా ఎవరికీ పెద్దగా అనుమానం ఉండదు. అలా ఇప్పటి వరకు భారత్ లో 10లక్షలమంది దొంగ డాక్టర్లు.. అసలు డాక్టర్ల కంటే ఘనంగా చలామణి అయిపోతున్నారు. వీరిలో దాదాపు 6 లక్షలమంది అల్లోపతి వైద్యం చేస్తుండగా.. మిగతా 4 లక్షలమంది ఆయుర్వేదం, యునాని, సిద్ధ.. వంటి సంప్రదాయ పద్ధతులలో వైద్యం చేస్తున్నారు, రోగులను బురిడీ కొట్టిస్తున్నారు.

కనిపెట్టడం ఎలా..?

ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిష్ లో భాగంగా దొంగ డాక్టర్లను కనిపెట్టడం కోసం హెల్త్ కేర్ ప్రొఫెషనల్ రిజిస్ట్రీ(HPR)ని తెరపైకి తెచ్చారు అధికారులు. వైద్య పరీక్షలన్నీ పాసైన సర్టిఫికెట్ ఉన్నవారు ఇందులో రిజిస్టర్ చేసుకోడానికి అర్హులు. సర్టిఫికెట్లతోపాటు, ఎక్కడ పనిచేస్తున్నారు, ప్రభుత్వ వైద్యుడా, ప్రైవేటు వైద్యుడా అనే వివరాలు కూడా అందులో పొందుపరచాలి. ఇవవ్నీ ఓసారి క్రాస్ చెక్ చేసుకుని వైద్యులకు HPR లో సభ్యత్వం ఇస్తారు.

ఇప్పటికే వైద్యులకు వివిధ రకాల సంఘాలున్నాయి. నేషనల్ మెడికల్ కమిషన్ (NMC), డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (DCI), నేషనల్ కమిషన్ ఆఫ్ ఇండియన్ సిస్టమ్ ఫర్ మెడిసిన్ (NCISM), నేషనల్ కమిషన్ ఫర్ హోమియో పతి (NCH) పేరుతో వివిధ సంస్థల్లో వైద్యులు తమ పేర్లను రిజిస్టర్ చేసుకుని ఉంటారు. అయితే వీరంతా ఇప్పుడు HPR లో సభ్యత్వం కూడా తీసుకోవాల్సి ఉంటుంది. దీన్ని కంపల్సరీ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటి వరకు HPRలో 15000 మంది మాత్రమే సభ్యులుగా ఉన్నారు. వీరిలో 15.5 శాతం మంది ప్రైవేట్ వైద్యులు. భవిష్యత్తులో HPRలో నమోదయ్యే డాక్టర్ల సంఖ్య పెరిగేలా చేస్తామంటున్నారు నేషనల్ హెల్త్ అథారిటీ సీఈఓ ఆర్ఎస్ శర్మ. అప్పుడే నకిలీ డాక్టర్లను బయటకు లాగొచ్చని చెబుతున్నారు.

First Published:  30 May 2022 11:40 AM IST
Next Story