మరో సినిమా లాంచ్ చేసిన అబ్బవరం
వరుసపెట్టి సినిమాలు రిలీజ్ చేస్తున్నాడు హీరో కిరణ్ అబ్బవరం. ఇతడు నటించిన సమ్మతమే సినిమా విడుదలకు సిద్ధమైంది. అంతలోనే మరో సినిమాను స్టార్ట్ చేశాడు ఈ హీరో. ఏఎం రత్నం సమర్పణలో శ్రీ సాయి సూర్య మూవీస్, స్టార్ లైట్ ఏంటర్ టైన్మెంట్స్ బ్యానర్లపై కిరణ్ అబ్బవరం హీరోగా కొత్త సినిమా లాంఛ్ అయింది. ఈ సినిమాకు రూల్స్ రంజన్ అనే పేరు పెట్టారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ సినిమాలో వెన్నెల కిషోర్, హిమాని, […]

వరుసపెట్టి సినిమాలు రిలీజ్ చేస్తున్నాడు హీరో కిరణ్ అబ్బవరం. ఇతడు నటించిన సమ్మతమే సినిమా విడుదలకు సిద్ధమైంది. అంతలోనే మరో సినిమాను స్టార్ట్ చేశాడు ఈ హీరో.
ఏఎం రత్నం సమర్పణలో శ్రీ సాయి సూర్య మూవీస్, స్టార్ లైట్ ఏంటర్ టైన్మెంట్స్ బ్యానర్లపై కిరణ్ అబ్బవరం హీరోగా కొత్త సినిమా లాంఛ్ అయింది. ఈ సినిమాకు రూల్స్ రంజన్ అనే పేరు పెట్టారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ సినిమాలో వెన్నెల కిషోర్, హిమాని, వైశాలి, ముంతాజ్, సత్య కీలక పాత్రలు పోషించబోతున్నారు.
రత్నం కృష్ణ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ప్రముఖ దర్శకుడు క్రిష్, కిరణ్ అబ్బరవంపై తీసిన తొలి షాట్ కు క్లాప్ కొట్టాడు. ప్రారంభోత్సవంతో పాటే సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుపెట్టారు.