Telugu Global
NEWS

కేజీఎఫ్-2 సినిమా చూశాడు.. ఆస్పత్రిపాలయ్యాడు

చిన్న పిల్లలపై, ముఖ్యంగా టీనేజర్లపై సినిమాల ప్రభావం ఎంతలా ఉంటుందో చెప్పడానికి ఇది ఓ తాజా ఉదాహరణ. ఇటీవల సూపర్ హిట్ అయిన కేజీఎఫ్ సిరీస్ లో హీరో చైన్ స్మోకర్ గా కనిపిస్తాడు. ప్రతి సీన్ లో హీరో నోట్లో సిగరెట్ ఉంటుంది, చేతిలో మందు బాటిల్ ఉంటుంది. ఈ రెండిటితోపాటు గన్ కూడా ఉంటుంది. హీరోలను ఆరాధించడం వేరు, హీరోలాగా ఉండాలనుకోవడం వేరు. టీనేజ్ పిల్లలు తమను తాము హీరోలుగా ఊహించుకుని.. హీరో చేసిన […]

KGF 2
X

చిన్న పిల్లలపై, ముఖ్యంగా టీనేజర్లపై సినిమాల ప్రభావం ఎంతలా ఉంటుందో చెప్పడానికి ఇది ఓ తాజా ఉదాహరణ. ఇటీవల సూపర్ హిట్ అయిన కేజీఎఫ్ సిరీస్ లో హీరో చైన్ స్మోకర్ గా కనిపిస్తాడు. ప్రతి సీన్ లో హీరో నోట్లో సిగరెట్ ఉంటుంది, చేతిలో మందు బాటిల్ ఉంటుంది. ఈ రెండిటితోపాటు గన్ కూడా ఉంటుంది. హీరోలను ఆరాధించడం వేరు, హీరోలాగా ఉండాలనుకోవడం వేరు. టీనేజ్ పిల్లలు తమను తాము హీరోలుగా ఊహించుకుని.. హీరో చేసిన పనులన్నీ చేయాలనుకుంటారు. హైదరాబాద్ లోని 15 ఏళ్ల పిల్లాడు కూడా కేజీఎఫ్-2 సినిమాలో హీరో లాగా సిగరెట్లు తాగి ఇప్పుడు ఆస్పత్రిపాలయ్యాడు.

సహజంగా టీనేజ్ లో సరదాగా మొదలయ్యే సిగరెట్, ఆ తర్వాత అలవాటుగా మారుతుంది. అయితే ఆ పిల్లాడు మాత్రం సినిమాలో హీరో లాగా ఒకదాని తర్వాత ఒకటి సిగరెట్ వెలిగిస్తూనే ఉన్నాడు. తల్లిదండ్రులు ఊరిలో లేకపోయే సరికి సినిమాలో తాను చూసినదాన్ని అమలులో పెట్టాడు. రెండు రోజుల్లో రెండు ప్యాకెట్ల సిగరెట్లు తాగేశాడు. అలవాటు లేకపోవడం, పసి వయసు కావడంతో.. దగ్గు ఎక్కువైంది, ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది, గొంతు మంట మొదలైంది. ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు ఆ పిల్లవాడి పరిస్థితి చూసి షాకయ్యారు. ఏంజరిగిందో తెలియక వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు.

ఊపిరి తిత్తుల వైద్య నిపుణులు ఆ పిల్లవాడి పరిస్థితి చూసి వెంటనే ఎక్స్ రే తీయించారు. ఎలాంటి ఇన్ఫెక్షన్ కనపడలేదు. కుడిచేతి మధ్యవేలుకి కాలిన గాయం ఉండటంతో.. అనుమానించారు. మెల్లగా బుజ్జగించి అసలేంజరిగిందో కనిపెట్టారు. కేజీఎఫ్ సినిమాలో హీరో రాఖీ భాయ్ లాగా తాను కూడా సిగరెట్లు తాగానని, అయితే తనకు ఆ అలవాటు లేకపోవడంతో చేయి కూడా కాలిందని చెప్పుకొచ్చాడు. రెండ్రోజుల్లో రెండు ప్యాకెట్ల సిగరెట్లు ఖాళీ చేశానని, ఆ తర్వాత తనకు గొంతు మంట మొదలైందని, ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా మారిందని చెప్పాడు. దగ్గు విడిచిపెట్టకుండా రావడంతో తల్లిదండ్రులకు చెప్పానన్నాడు. వైద్యులే కాదు, పేరెంట్స్ కూడా ఈ విషయం తెలుసుకుని షాకయ్యారు. ప్రస్తుతం ఆ పిల్లవాడికి వైద్యులు ట్రీట్మెంట్ తోపాటు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించేశారు.

First Published:  29 May 2022 7:59 AM IST
Next Story