Telugu Global
Health & Life Style

మంకీపాక్స్ తో భయం భయం.. భారత్ ఎంత భద్రం..?

కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న వేళ.. ప్రపంచ దేశాలను మంకీపాక్స్ కలవరపెడుతోంది. ఇప్పటి వరకూ 20 దేశాల్లో మంకీపాక్స్ విస్తరించినట్టు తెలుస్తోంది. 200 పైగా కేసులు నమోదయ్యాయి, మరో వందమంది అనుమానితులను విడిగా ఉంచి పరీక్షలు చేస్తున్నారు. పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో మొదటగా ఈ వైరస్ ని గుర్తించారు. ఇప్పుడిది ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలను భయపెడుతోంది. విదేశీ ప్రయాణికులపై నిఘా పెట్టాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతోంది. కొత్తగా మెక్సికో, ఐర్లాండ్ దేశాల్లో కూడా ఈ వైరస్ […]

మంకీపాక్స్ తో భయం భయం.. భారత్ ఎంత భద్రం..?
X

కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న వేళ.. ప్రపంచ దేశాలను మంకీపాక్స్ కలవరపెడుతోంది. ఇప్పటి వరకూ 20 దేశాల్లో మంకీపాక్స్ విస్తరించినట్టు తెలుస్తోంది. 200 పైగా కేసులు నమోదయ్యాయి, మరో వందమంది అనుమానితులను విడిగా ఉంచి పరీక్షలు చేస్తున్నారు. పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో మొదటగా ఈ వైరస్ ని గుర్తించారు. ఇప్పుడిది ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలను భయపెడుతోంది. విదేశీ ప్రయాణికులపై నిఘా పెట్టాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతోంది. కొత్తగా మెక్సికో, ఐర్లాండ్ దేశాల్లో కూడా ఈ వైరస్ వెలుగు చూసింది. అమెరికా నుంచి వచ్చిన 50 ఏళ్ల వ్యక్తిలో మంకీపాక్స్‌ లక్షణాలు గుర్తించినట్లు మెక్సికో ప్రకటించింది. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు అక్కడి వైద్య అధికారులు. ఇక ఐర్లాండ్ లో కూడా తొలి కేసు నమోదైంది. ఇవే లక్షణాలున్న మరో వ్యక్తిని కూడా అధికారులు పరీక్షిస్తున్నారు.

భారత్ పరిస్థితి ఏంటి..?

భారత్ లో ఇప్పటి వరకూ మంకీపాక్స్ కేసులు నమోదు కాలేదు. తమిళనాడు, రాజస్థాన్, మహారాష్ట్ర ప్రభుత్వాలు ముందుగా అప్రమత్తం అయ్యాయి. గత 21 రోజుల ముందుగా విదేశీ పర్యటన చేసిన ప్రయాణికులలో దద్దుర్లు వంటి లక్షణాలు ఉన్నవారికి తమిళనాడు వైద్య అధికారులు స్క్రీనింగ్ టెస్టులు చేస్తున్నారు. మంకీపాక్స్ లక్షణాలు ఉంటే వారిని ఐసోలేషన్లో చేర్చాలని తమిళనాడు ఆరోగ్య శాఖ కన్వీనర్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఇక మంకీపాక్స్ వైరస్ అనుమానితులకోసం మహారాష్ట్ర ప్రభుత్వం ముంబైలోని కస్తూర్బా ఆస్పత్రిలో 28 పడకల వార్డుని సిద్ధం చేసింది.

తాజాగా తెలంగాణ ప్రభుత్వం మంకీపాక్స్ వైరస్‌ నియంత్రణపై కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. మంకీపాక్స్ లక్షణాలు ఉన్న వారిని గుర్తించి ఐసోలేషన్‌లో ఉంచుతున్నట్లు పేర్కొంది. ఇటీవల మంకీపాక్స్ ప్రబలుతున్న దేశాలకు వెళ్లి వచ్చిన వారిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఒంటిపై దుద్దర్లు, రాషెస్ వచ్చిన అనుమానితులు వెంటనే వైద్యాధికారులను సంప్రదించాలని కోరింది. అనుమానితుల బ్లడ్ శాంపిల్స్ ని పుణెలోని వైరాలజీ ఇన్ స్టిట్యూట్ కి పంపిస్తున్నారు అధికారులు.

అంత ప్రమాదమా..?

మంకీపాక్స్, కరోనా వైరస్ లాంటిది కాదని చెబుతున్నారు అమెరికా అంటువ్యాధుల నిపుణులు. మంకీపాక్స్ వైరస్ కొత్తగా పుట్టుకొచ్చింది కాదని, దశాబ్దాలుగా ఈ వైరస్ కొన్ని దేశాల్లో ఉందని, మశూచి కుటుంబానికి చెందినదేని చెబుతున్నారు. ఒకవేళ మంకీపాక్స్ వ్యాపించినా దానికి మందులు ఉన్నాయని, బాధితులకు ప్రాణాపాయం తక్కువ అని భరోసా ఇస్తున్నారు.

ALSO READ: కరోనా సైడ్ ఎఫెక్ట్స్ చాలా దారుణం.. గుండె పనితీరును నాశనం చేస్తోంది.. ఒక అధ్యయనంలో వెల్లడి

First Published:  29 May 2022 11:37 AM IST
Next Story