Telugu Global
NEWS

కప్పు కొడితే 20 కోట్లు! ఐపీఎల్-15 ట్రోఫీ ఎవరిదో?

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్ ఐపీఎల్ 15వ సీజన్ సమరం క్లైయ్ మాక్స్ దశకు చేరింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగే టైటిల్ సమరంలో మాజీ చాంపియన్ రాజస్థాన్ రాయల్స్, లీగ్ టేబుల్ టాపర్ గుజరాత్ టైటాన్స్ ఢీకొనబోతున్నాయి. ఐపిఎల్ ఫైనల్స్ కు అహ్మదాబాద్ తొలిసారిగా వేదిక కావడంతో…టైటిల్ సమరం టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. దేశంలోనే అతిపెద్ద క్రికెట్ వేదిక మోడీ స్టేడియం కిటకిటలాడనుంది. మొత్తం 10 జట్లు, 70 మ్యాచ్ […]

కప్పు కొడితే 20 కోట్లు! ఐపీఎల్-15 ట్రోఫీ ఎవరిదో?
X

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్ ఐపీఎల్ 15వ సీజన్ సమరం క్లైయ్ మాక్స్ దశకు చేరింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగే టైటిల్ సమరంలో
మాజీ చాంపియన్ రాజస్థాన్ రాయల్స్, లీగ్ టేబుల్ టాపర్ గుజరాత్ టైటాన్స్ ఢీకొనబోతున్నాయి.
ఐపిఎల్ ఫైనల్స్ కు అహ్మదాబాద్ తొలిసారిగా వేదిక కావడంతో…టైటిల్ సమరం టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. దేశంలోనే అతిపెద్ద క్రికెట్ వేదిక మోడీ స్టేడియం కిటకిటలాడనుంది.
మొత్తం 10 జట్లు, 70 మ్యాచ్ ల లీగ్ దశలో 20 పాయింట్లతో అహ్మదాబాద్ టైటాన్స్, 18 పాయింట్లతో రాజస్థాన్ రాయల్స్ లీగ్ టేబుల్ మొదటి రెండుస్థానాలలో నిలవడం ద్వారా ప్లేఆఫ్ రౌండ్లో అడుగుపెట్టాయి.
తొలి క్వాలిఫైయర్ లో నెగ్గడం ద్వారా గుజరాత్ టైటాన్స్ నేరుగా ఫైనల్స్ కు చేరుకొంటే…క్వాలిఫైయర్ -2 రౌండ్లో నెగ్గడం ద్వారా రాజస్థాన్ రాయల్స్ టైటిల్ సమరానికి అర్హత సంపాదించింది.

విజేతకు భారీ ప్రైజ్ మనీ… ఐపీఎల్ ఫైనల్లో విజేతగా నిలిచిన జట్టుకు ట్రోఫీతో పాటు..20 కోట్ల రూపాయల ప్ర్రైజ్ మనీ సొంతం కానుంది. ఫైనల్లో ఓడిన జట్టు మాత్రం 13 కోట్ల రూపాయల ప్ర్రైజ్ మనీతో సరిపెట్టుకోవాల్సి ఉంది.

బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలలో అత్యుత్తమంగా రాణించిన ఆటగాళ్ల కోసమూ ఫ్రైజ్ మనీ సిద్ధంగా ఉంది. అత్యుత్తమ బ్యాటర్ కు ఆరెంజ్ క్యాప్ తో పాటు 15 లక్షల రూపాయలు, అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ కు పర్పుల్ క్యాప్ తో పాటు 15 లక్షల రూపాయలు అందచేయనున్నారు.

బట్లర్ కే ఆరెంజ్ క్యాప్…

అత్యుత్తమ బ్యాటర్, బౌలర్ అవార్డులు రెండూ రాజస్థాన్ రాయల్స్ స్టార్ ప్లేయర్లు జోస్ బట్లర్, యజువేంద్ర చహాల్ దక్కించుకోనున్నారు. క్వాలిఫైయర్ -2వ మ్యాచ్ వరకూ ఆడిన మొత్తం 16 మ్యాచ్ ల్లో రాజస్థాన్ ఓపెనర్ జోస్ బట్లర్ 4 శతకాలు, 4 అర్థశతకాలతో సహా 824 పరుగులు సాధించడం ద్వారా ఆరెంజ్ క్యాప్ ఖాయం చేసుకొన్నాడు. బౌలింగ్ లో లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహాల్ 16 మ్యాచ్ ల్లో 26 వికెట్లు పడగొట్టడం ద్వారా…పర్పుల్ క్యాప్ ముంగిట నిలిచాడు.

ఫైనల్లో జోస్ బట్లర్, చహాల్ ఆడాల్సి ఉంది.

ముంబై పాంచ్ పటాకా…

ఐపీఎల్ గత 14 సీజన్లలో అత్యధికంగా ఐదుసార్లు టైటిల్ నెగ్గినజట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది. రోహిత్ శర్మ నాయకత్వంలోని ముంబై జట్టు ( 2013, 2015, 2017, 2019, 2020 ) విజేతగా నిలిచింది.
ఆ తర్వాతి స్థానంలో చెన్నై ( 2010, 2011, 2018, 2021 ) నాలుగు టైటిల్స్ తో రెండో అత్యంత విజయవంతమైన జట్టుగా రికార్డుల్లో చేరింది.

గౌతం గంభీర్ నాయకత్వంలోని కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు 2012, 2014 సీజన్లలోనూ, 2008లో రాజస్థాన్ రాయల్స్, 2009లో హైదరాబాద్ డెక్కన్ చార్జర్స్, 2016 లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు ఐపీఎల్ చాంపియన్లు కాగలిగాయి.

ప్రస్తుత సీజన్ ఫైనల్లో రాజస్థాన్ రాయల్స్ నెగ్గితే ..14 సంవత్సరాల విరామం తర్వాత టైటిల్ సాధించినజట్టుగా నిలిచిపోతుంది. అదే గుజరాత్ టైటాన్స్ విజేత కాగలిగితే..
అరంగేట్రం సీజన్లోనే విన్నర్ గా నిలిచినజట్టుగా చరిత్ర సృష్టించగలుగుతుంది.

First Published:  28 May 2022 11:54 PM GMT
Next Story