Telugu Global
National

మరోసారి స్వంత ప్రభుత్వాన్నే టార్గెట్ చేసిన వరుణ్ గాంధీ

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పిలిభిత్ ఎంపీ వరుణ్ గాంధీ మరోసారి తన స్వంత ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ఈసారి నిరుద్యోగ సమస్యపై వరుణ్ గాంధీ తన ప్రభుత్వంపై ప్రశ్నలు సంధించారు. దేశంలో ద్రవ్యోల్బణం తర్వాత అతిపెద్ద సమస్య నిరుద్యోగం. దీనిపై వరుణ్ గాంధీ తన స్వంత ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా ప్రశ్నలు సంధించారు. నిరుద్యోగ సమస్యపై ఒకవైపు ప్రతిపక్షాలు ప్రభుత్వంపై దాడి చేస్తుండగా , ఇప్పుడు బిజెపి ఎంపీ కూడా నిరుద్యోగం గురించి తన […]

మరోసారి స్వంత ప్రభుత్వాన్నే టార్గెట్ చేసిన వరుణ్ గాంధీ
X

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పిలిభిత్ ఎంపీ వరుణ్ గాంధీ మరోసారి తన స్వంత ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ఈసారి నిరుద్యోగ సమస్యపై వరుణ్ గాంధీ తన ప్రభుత్వంపై ప్రశ్నలు సంధించారు. దేశంలో ద్రవ్యోల్బణం తర్వాత అతిపెద్ద సమస్య నిరుద్యోగం. దీనిపై వరుణ్ గాంధీ తన స్వంత ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా ప్రశ్నలు సంధించారు. నిరుద్యోగ సమస్యపై ఒకవైపు ప్రతిపక్షాలు ప్రభుత్వంపై దాడి చేస్తుండగా , ఇప్పుడు బిజెపి ఎంపీ కూడా నిరుద్యోగం గురించి తన స్వంత ప్రభుత్వంపై విరుచుకపడ్డారు.

కేంద్రంలోని ఆర్మీ, పోలీసు, ఆరోగ్యం తదితర విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల సంఖ్య గురించి బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ ట్వీట్ చేశారు. నిరుద్యోగం 3 దశాబ్దాల గరిష్ట స్థాయికి చేరుకుందని చెప్పిన వరుణ్ గాంధీ, ఈ గణాంకాలు దిగ్భ్రాంతిని కలిగిస్తాయన్నారు. కోట్లాది మంది యువత రిక్రూట్‌మెంట్ లేకపోవడంతో నిరాశకు గురవుతుండగా, దేశంలో 60 లక్షల ‘మంజూరైన పోస్టులు’ ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వం గణాంకాలే చెప్తున్నాయన్నారు. ఈ పోస్టులకు కేటాయించిన బడ్జెట్ ఎక్కడికి పోయింది.. తెలుసుకోవడం ప్రతి యువకుడి హక్కు అని వరుణ్ గాంధీ స్పష్టం చేశారు.

దేశంలో మంజూరైన‌ ప్రభుత్వ పోస్టుల్లో రిక్రూట్‌మెంట్‌ను చేపట్టకూడదని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నిర్ణయించుకోవడంలో ఉద్దేశ్యం ఏంటని ఆయన‌ ప్రశ్నించారు. దేశంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల‌పై వరుణ్ గాంధీ నేరుగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

దేశంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో మంజూరైన ఖాళీ పోస్టులకు సంబంధించిన గణాంకాలను వరుణ్ గాంధీ తన ట్వీట్ లో షేర్ చేశారు. దీని ప్రకారం దేశంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో 60 లక్షలకు పైగా మంజూరైన పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వం, ఆరోగ్య సేవలు, విద్యాశాఖ, సైన్యం, పోలీసు, కోర్టుల్లోని వివిధ విభాగాల్లో అనేక వేల మంజూరైన పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

First Published:  28 May 2022 7:07 AM IST
Next Story