Telugu Global
NEWS

నీళ్ల బాటిల్‌కు పేరు, డిజైన్ డిసైడ్ చెయ్యండి.. బహుమతులు పట్టండి

పోలీసు అధికారిగా అందరికీ సుపరిచితమైన వీసీ సజ్జనార్.. టీఎస్ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి వినూత్నమైన నిర్ణయాలతో మరింత చేరువయ్యారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించడానికి పలు ప్రణాళికలు రూపొందించారు. తెలంగాణతో పాటు ఆంధ్రా, కర్ణాటక, మహారాష్ట్రలకు కూడా బస్సులు నడుపుతూ ఆదాయాన్ని పెంచారు. మరోవైపు బల్క్ డీజిల్ ధర పెరగడంతో బయట బంకుల్లో కొట్టించేలా నిర్ణయం తీసుకొని భారం తగ్గించారు. తాజాగా టీఎస్ఆర్టీలో మరో నిర్ణయాన్ని తీసుకున్నారు. బస్టాండ్స్, బస్సుల్లో అమ్మడానికి వీలుగా సొంత […]

నీళ్ల బాటిల్‌కు పేరు, డిజైన్ డిసైడ్ చెయ్యండి.. బహుమతులు పట్టండి
X

పోలీసు అధికారిగా అందరికీ సుపరిచితమైన వీసీ సజ్జనార్.. టీఎస్ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి వినూత్నమైన నిర్ణయాలతో మరింత చేరువయ్యారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించడానికి పలు ప్రణాళికలు రూపొందించారు. తెలంగాణతో పాటు ఆంధ్రా, కర్ణాటక, మహారాష్ట్రలకు కూడా బస్సులు నడుపుతూ ఆదాయాన్ని పెంచారు. మరోవైపు బల్క్ డీజిల్ ధర పెరగడంతో బయట బంకుల్లో కొట్టించేలా నిర్ణయం తీసుకొని భారం తగ్గించారు.

తాజాగా టీఎస్ఆర్టీలో మరో నిర్ణయాన్ని తీసుకున్నారు. బస్టాండ్స్, బస్సుల్లో అమ్మడానికి వీలుగా సొంత బ్రాండ్ వాటర్ బాటిల్స్‌ను పరిచయం చేయనున్నారు. ముఖ్యంగా గరుడ, రాజధాని బస్సుల్లో బయటి బ్రాండ్లు కాకుండా ఇకపై టీఎస్ఆర్టీసీ బ్రాండ్ వాటర్ అందించనున్నారు. అయితే ఈ వాటర్ బాటిల్స్‌కు ఒక పేరు, బాటిల్ డిజైన్ సూచించాలని వీసీ సజ్జనార్ కోరారు. ఎంపికైన పేరు, డిజైన్ ఇచ్చిన వారికి తగిన పారితోషికం కూడా ఇస్తామని సజ్జనార్ ట్వీట్ చేశారు.

ఎవరైనా సరే టీఎస్ఆర్టీసీ వాటర్ బాటిల్ డిజైన్, పేరును సూచిస్తూ 9440970000 నెంబర్‌కు వాట్సప్ చేయాలని.. #TSRTCompetition హ్యాష్ ట్యాగ్ ఇస్తూ మెసేజ్ చేయాలంటూ సజ్జనార్ ట్వీట్ చేశారు. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీ సజెషన్స్ ఇవ్వండి.. బహుమతులు పట్టండి.

First Published:  28 May 2022 9:57 AM GMT
Next Story