టీడీపీ గెలిస్తే సంక్షేమ పథకాలు రద్దు " మంత్రి జోగి రమేశ్
వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే సంక్షేమ పథకాలు రద్దు కావడం ఖాయమని మంత్రి జోగి రమేశ్ పేర్కొన్నారు. చంద్రబాబు నిరంతరం టెక్నాలజీ, నగరీకరణ అంటూ పేదలను పట్టించుకోరని పేర్కొన్నారు. సామాజిక న్యాయభేరీ పేరిట మంత్రులు నిర్వహిస్తున్న బస్సు యాత్ర శనివారం విజయవాడలోని బెంజ్ సర్కిల్ కు చేరుకున్నది. ఈ సందర్భంగా మంత్రి జోగి రమేశ్ మాట్లాడుతూ.. సీఎం జగన్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల ద్వారా రూ. 1.40 లక్షల కోట్లని సీఎం జగన్ […]
వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే సంక్షేమ పథకాలు రద్దు కావడం ఖాయమని మంత్రి జోగి రమేశ్ పేర్కొన్నారు. చంద్రబాబు నిరంతరం టెక్నాలజీ, నగరీకరణ అంటూ పేదలను పట్టించుకోరని పేర్కొన్నారు. సామాజిక న్యాయభేరీ పేరిట మంత్రులు నిర్వహిస్తున్న బస్సు యాత్ర శనివారం విజయవాడలోని బెంజ్ సర్కిల్ కు చేరుకున్నది. ఈ సందర్భంగా మంత్రి జోగి రమేశ్ మాట్లాడుతూ.. సీఎం జగన్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల ద్వారా రూ. 1.40 లక్షల కోట్లని సీఎం జగన్ బటన్ నొక్కి నేరుగా ప్రజల అకౌంట్లలోకి సొమ్ము వేశారని గుర్తుచేశారు.
సంక్షేమంలో ఒక్క పైసా కూడా అవినీతి జరగలేదని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో సామాజికన్యాయం అమలవుతోందని పేర్కొన్నారు. సంక్షేమపథకాలు అమలవుతుంటే చంద్రబాబుకు నిద్ర పట్టడం లేదని విమర్శించారు. మహానాడు సభకు జనం రాక వెల వెల పోతుంటే.. మంత్రుల బస్సుయాత్రకు మాత్రం ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారని పేర్కొన్నారు.
మరో 25 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా జగన్ ఉంటారని అన్నారు. చంద్రబాబుకు ప్రజలమీద ద్వేషం తప్ప ప్రేమ లేదని వ్యాఖ్యానించారు. అందుకే మహానాడులో ఉన్మాదిగా మారి.. తన వాళ్లచేత ముఖ్యమంత్రి జగన్ ను తిట్టిస్తున్నారని ఆరోపించారు.
పార్టీ విధానాలను, తప్పొప్పులను సమీక్షించుకోవాల్సిన మహానాడు వేదికలో జగన్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. చంద్రబాబు ఫ్రస్ట్రేషనల్ లో ఏం మాట్లాడుతున్నారో.. ఆయనకే అర్థం కావడం లేదని విమర్శించారు. సీఎం జగన్ అన్ని వర్గాల ప్రజలను అధికారంలో భాగస్వాములు చేశారని పేర్కొన్నారు.