Telugu Global
NEWS

కేటీఆర్ దావోస్ యాత్ర విజయవంతం -తెలంగాణకు 4200 కోట్ల పెట్టుబడులు

తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు (కేటీఆర్) దావోస్‌లో ఐదు రోజుల సుదీర్ఘ పర్యటన ముగించారు. ఆయన అక్కడ వార్షిక ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్నారు. కేటీఆర్ తీవ్ర కృషి ఫలితంగా రాష్ట్రానికి 4200 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు వచ్చాయి. దావోస్‌లో చివరిరోజున స్విట్జర్లాండ్‌లోని జ్యురిక్‌లో జెడ్‌ఎఫ్‌ కంపెనీ ప్రతినిధులతో కేటీఆర్‌ సమావేశమయ్యారు. అనంతరం జర్మన్ ఆటోమోటివ్ మేజర్ అయిన ZF 3,000 మంది ఉద్యోగులతో హైదరాబాద్‌లో తన విస్తరణను ప్రారంభించనుందని, నానక్‌రామ్‌గూడలోని […]

KTR
X

తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు (కేటీఆర్) దావోస్‌లో ఐదు రోజుల సుదీర్ఘ పర్యటన ముగించారు. ఆయన అక్కడ వార్షిక ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్నారు. కేటీఆర్ తీవ్ర కృషి ఫలితంగా రాష్ట్రానికి 4200 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు వచ్చాయి.

దావోస్‌లో చివరిరోజున స్విట్జర్లాండ్‌లోని జ్యురిక్‌లో జెడ్‌ఎఫ్‌ కంపెనీ ప్రతినిధులతో కేటీఆర్‌ సమావేశమయ్యారు. అనంతరం జర్మన్ ఆటోమోటివ్ మేజర్ అయిన ZF 3,000 మంది ఉద్యోగులతో హైదరాబాద్‌లో తన విస్తరణను ప్రారంభించనుందని, నానక్‌రామ్‌గూడలోని తెలంగాణ మొబిలిటీ వ్యాలీలో ఆ సంస్థ పెద్ద భాగం అవుతుందని కెటిఆర్ ప్రకటించారు.

హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో డీఎఫ్‌ఈ ఫార్మా సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ “క్లోజర్ టు ది ఫార్ములేటర్” (సీ2ఎఫ్) రానుందని శుక్రవారం కేటీఆర్ తెలిపారు.

ఈ నెల 22న దావోస్‌కు చేరుకున్న కేటీఆర్ ఆరోజు నుంచి 26వ తేదీ వరకు నిర్విరామంగా 45 కంపెనీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించారు. నాలుగు రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు, మరో నాలుగు చర్చా గోష్టుల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, కంపెనీలకు ప్రభుత్వ సహకార విధానాలను కేటీఆర్‌ వివరించారు. వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం సమావేశాల్లో భాగంగా ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్‌కు బహుళజాతి కంపెనీల ప్రతినిధుల నుంచి ప్రశంసలు దక్కాయి. పలు అవగాహన ఒప్పందాలు జరిగాయి. పెట్టుబడి ప్రకటనలు వచ్చాయి.

యాత్రను ఇం త భారీగా విజయవంతం చేసినందుకు తన బృందానికి మరియు తెలంగాణ ప్రవాసులకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.

First Published:  28 May 2022 5:58 AM IST
Next Story