Telugu Global
Cinema & Entertainment

కేజీఎఫ్-2 ఓటీటీ రిలీజ్ డేట్ చెప్పని ప్రైమ్ వీడియో.. ఇంకొన్ని రోజులు ఎదురు చూపులు తప్పవు..!

ప్రపంచవ్యాప్తంగా రూ.1,200 కోట్లకు పైగా వసూలు చేసి.. ఇంకా కలెక్షన్లతో దూసుకొని పోతున్న కేజీఎఫ్- చాప్టర్ 2 ఓటీటీ రిలీజ్ ఎప్పుడా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. మే 27న కేజీఎఫ్-2 అమెజాన్ ప్రైమ్‌లో విడుదల అవుతుందని మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో శుక్రవారం అంతా ప్రేక్షకులు ఆ సినిమా కోసం ఎదురు చూశారు. కానీ గత 10 రోజులుగా రెంటల్‌లో ఉన్న ఆ సినిమా ఇప్పటికీ అదే మోడ్‌లో ఉన్నది. రూ.199 చెల్లింది 48 గంటల […]

KGF 2
X

ప్రపంచవ్యాప్తంగా రూ.1,200 కోట్లకు పైగా వసూలు చేసి.. ఇంకా కలెక్షన్లతో దూసుకొని పోతున్న కేజీఎఫ్- చాప్టర్ 2 ఓటీటీ రిలీజ్ ఎప్పుడా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. మే 27న కేజీఎఫ్-2 అమెజాన్ ప్రైమ్‌లో విడుదల అవుతుందని మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో శుక్రవారం అంతా ప్రేక్షకులు ఆ సినిమా కోసం ఎదురు చూశారు. కానీ గత 10 రోజులుగా రెంటల్‌లో ఉన్న ఆ సినిమా ఇప్పటికీ అదే మోడ్‌లో ఉన్నది. రూ.199 చెల్లింది 48 గంటల లోపు సినిమా చూసేలా ప్రైమ్ పెట్టిన సెట్టింగ్‌లో ఏ మార్పు లేదు.

మే 27న సినిమా ప్రైమ్ వీడియో సబ్‌స్క్రైబర్లకు ఫ్రీగా వస్తుందని ఎదురు చూసి ఇక ఏకంగా ఆ కంపెనీని ట్విట్టర్ ద్వారా ప్రేక్షకులు అడిగేశారు. అయితే దానికి సంబంధించిన అప్డేట్ త్వరలో ఇస్తామని చెప్పిందే తప్ప కచ్చితమైన డేట్ చెప్పలేదు. మే 27న కేజీఎఫ్-2 ఓటీటీ రిలీజ్ అని ప్రైమ్ వీడియో ఏనాడూ చెప్పలేదు. కానీ కొన్ని ఎంటర్‌టైన్‌మెంట్ వెబ్‌సైట్లు, జాతీయ మీడియాలో మే 27అని వార్తలు రావడంతో ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూశారు.

కేజీఎఫ్-2 నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ గానీ, దర్శకుడు ప్రశాంత్ నీల్ గానీ ఓటీటీ రిలీజ్‌కు సంబంధించి ఒక్క మాట కూడా చెప్పలేదు. అయితే ఈ తేదీ ఎలా బయటకు వచ్చిందనేది ఎవరికీ తెలియడం లేదు.

మరోవైపు విష్వక్సేన్ నటించిన ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ సినిమాను ఆహా ఓటీటీ జూన్ 3న రిలీజ్ చేస్తామని ప్రకటించింది. ఈ వారం ఓటీటీలో ఒక్క తెలుగు సినిమా కూడా రిలీజ్ కాకపోవడంతో ప్రేక్షకులు హిందీలో రిలీజ్ అయిన ఎటాక్ 1, హీరోపంతీ 2తోనే సరిపెట్టుకోవల్సి వచ్చింది.

First Published:  28 May 2022 5:22 AM IST
Next Story