Telugu Global
Family

దేశంలో సగం మంది స్కూల్ విద్యార్థులు నడిచే బడికెళ్తున్నారు.. ఓ సర్వేలో విస్మయకరమైన విషయాలు

దేశంలో దాదాపు సగం మంది (48 శాతం) విద్యార్థులు నడిచే బడికి వెళ్తున్నట్లు నేషనల్ అఛీవ్‌మెంట్ సర్వేలో తేలింది. స్కూల్ బస్సుల్లో 9 శాతం, ప్రజా రవాణా వాహనాల్లో 9 శాతం, సొంత వాహనాల్లో 8 శాతం మంది విద్యార్థులు స్కూల్స్‌కు వెళ్తున్నట్లు ఆ సర్వేలో తేలింది. దీనికి సంబంధించిన వివరాలను కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. దేశంలోని పాఠశాలల్లో విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు లేరని.. 65 శాతం మంది టీచర్లపై అదనపు భారం పడుతున్నదని […]

విద్యార్థులు
X

దేశంలో దాదాపు సగం మంది (48 శాతం) విద్యార్థులు నడిచే బడికి వెళ్తున్నట్లు నేషనల్ అఛీవ్‌మెంట్ సర్వేలో తేలింది. స్కూల్ బస్సుల్లో 9 శాతం, ప్రజా రవాణా వాహనాల్లో 9 శాతం, సొంత వాహనాల్లో 8 శాతం మంది విద్యార్థులు స్కూల్స్‌కు వెళ్తున్నట్లు ఆ సర్వేలో తేలింది. దీనికి సంబంధించిన వివరాలను కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. దేశంలోని పాఠశాలల్లో విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు లేరని.. 65 శాతం మంది టీచర్లపై అదనపు భారం పడుతున్నదని సర్వే వెల్లడించింది. ఇక 97 శాతం మంది ఉపాధ్యాయులు తాము చేస్తున్న ఉద్యోగం పట్ల సంతృప్తిగా లేరని తేలింది.

ఇక పాఠశాలల్లో చదువుకునే 25 శాతం మంది విద్యార్థులకు వారి తల్లిదండ్రుల నుంచి హోం వర్క్, ఇతర విషయాల్లో సరైన సహకారం అందడం లేదని తెలిసింది. దీని వల్ల విద్యార్థుల్లో పఠనాసక్తి తగ్గిపోతున్నట్లు గుర్తించారు. నిరుడు నవంబర్‌లో నిర్వహించిన ఈ సర్వేలో దేశంలోని 720 జిల్లాల్లోని 1 లక్షా 18 వేల పాఠశాలల్లో ఈ సర్వే నిర్వహించారు. ఇందులో 34 లక్షల మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరిలోనే 48 శాతం మంది నడిచే పాఠశాలకు వస్తున్నట్లు చెప్పారు.

ఇక కరోనా కారణంగా విద్యార్థులు చాలా ఇబ్బంది పడినట్లు సర్వేలో గుర్తించారు. 10వ తరగతి విద్యార్థులపై ఈ భారం పెద్దగా లేకపోయినా.. 8వ తరగతి విద్యార్థులు మాత్రం చాలా ఇబ్బంది పడినట్లు తెలుస్తున్నది. వరుసగా రెండేళ్లు పాఠశాలలు సరిగా నడవక పోవడంతో 8వ తరగతి విద్యార్థులు చదువును సరిగా కొనసాగించకుండానే ఇంటర్‌కు చేరుకున్నారని.. ఇది వారి చదువులపై ప్రభావం చూపిందని సర్వేలో చెప్పారు.

First Published:  28 May 2022 7:10 AM IST
Next Story