Telugu Global
National

పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు రాజ్యసభ టికెట్లు ఇచ్చిన ఆప్

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్న ఆప్.. తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నది. పంజాబ్ రాజ్యసభ కోటాలోని రెండు సీట్లను పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు కేటాయించింది. వీరిద్దరికీ పార్టీతో ఎలాంటి సంబంధం లేకపోయినా.. వారికి తగిన గౌరవం ఇవ్వాలనే రాజకీయాలకు దూరంగా ఉండే విద్యావంతులను ఎంపిక చేసినట్లు ఆఫ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. దేశంలోని […]

పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు రాజ్యసభ టికెట్లు ఇచ్చిన ఆప్
X

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్న ఆప్.. తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నది. పంజాబ్ రాజ్యసభ కోటాలోని రెండు సీట్లను పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు కేటాయించింది. వీరిద్దరికీ పార్టీతో ఎలాంటి సంబంధం లేకపోయినా.. వారికి తగిన గౌరవం ఇవ్వాలనే రాజకీయాలకు దూరంగా ఉండే విద్యావంతులను ఎంపిక చేసినట్లు ఆఫ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.

దేశంలోని పలు రాష్ట్రాల్లో రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. ఈ క్రమంలో పంజాబ్‌లో ఖాళీ అవుతున్న సీట్లకు కూడా ఎన్నికలు జరుగనున్నాయి. పంజాబ్ అసెంబ్లీలో ఆప్‌కే బలం ఎక్కువగా ఉండటంతో ఈ రెండు సీట్లు సులభంగానే దక్కించుకోనుంది. ఈ క్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహీతలు విక్రమ్ జిత్ సింగ్ సాహ్ని, పర్యవరణ పరిరక్షకుడు బల్బీర్ సింగ్‌లకు సీట్లు కేటాయించింది.

‘ఆప్ ఇద్దరు విద్యావంతులు, పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు సీట్లు కేటాయించిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. వారిద్దరికీ నా బెస్ట్ విషెస్’ అంటూ పంజాబ్ సీఎం మన్ ట్వీట్ చేశారు. పంజాబ్ నుంచి ఎంపీలుగా ఉన్న అంబికా సోని (కాంగ్రెస్), బల్వీందర్ సింగ్ (శిరోమణి అకాలీదళ్) జూలై 4న పదవీకాలం ముగియనుంది. జూన్ 10న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అదేరోజు కౌంటింగ్ కూడా జరుగనున్నది.

First Published:  28 May 2022 1:12 PM IST
Next Story