నేటి నుండి టీడీపీ మహానాడు... పొత్తులపై చర్చ
తెలుగుదేశం పార్టీ మహానాడు ఈ రోజు ప్రారంభంకానుంది. రెండురోజులపాటు ఒంగోలులో నిర్వహించే ఈ మహానాడులో పాల్గొనేందుకు పార్టీ నేతలంతా ఇప్పటికే ఒంగోలు చేరుకున్నారు. పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు కూడా గురువారం సాయంత్రానికే ఒంగోలు చేరుకున్నారు. ఈ క్రమంలో మహానాడులో ప్రవేశపెట్టాల్సిన తీర్మానాల ఖరారుపై పార్టీ అత్యున్నత నిర్ణాయక విభాగం పొలిట్ బ్యూరో ఒంగోలులో భేటీ అయ్యింది. మహానాడులో మొత్తం 17 అంశాలపై టీడీపీ తీర్మానాలను ప్రవేశపెట్టనుంది. రాజకీయ అంశంపై ప్రవేశపెట్టే తీర్మానంపై పొలిట్ బ్యూరో ప్రధానంగా […]
తెలుగుదేశం పార్టీ మహానాడు ఈ రోజు ప్రారంభంకానుంది. రెండురోజులపాటు ఒంగోలులో నిర్వహించే ఈ మహానాడులో పాల్గొనేందుకు పార్టీ నేతలంతా ఇప్పటికే ఒంగోలు చేరుకున్నారు. పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు కూడా గురువారం సాయంత్రానికే ఒంగోలు చేరుకున్నారు. ఈ క్రమంలో మహానాడులో ప్రవేశపెట్టాల్సిన తీర్మానాల ఖరారుపై పార్టీ అత్యున్నత నిర్ణాయక విభాగం పొలిట్ బ్యూరో ఒంగోలులో భేటీ అయ్యింది.
మహానాడులో మొత్తం 17 అంశాలపై టీడీపీ తీర్మానాలను ప్రవేశపెట్టనుంది. రాజకీయ అంశంపై ప్రవేశపెట్టే తీర్మానంపై పొలిట్ బ్యూరో ప్రధానంగా దృష్టి సారించింది. వచ్చే ఎన్నికల్లో ఓట్ల చీలిక లేకుండా జాగ్రత్తలు తీసుకుంటామంటూ ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇదే అంశంపై రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టే దిశగా పొలిట్ బ్యూరో సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం.అలాగే పొత్తుల అంశంపై మహానాడులో సీరియస్ చర్చ జరిగే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
ALSO READ: జీఎంఎం ఫాడ్‌లర్ విస్తరణ -హైదరాబాద్ లో 10 మిలియన్ డాలర్ల పెట్టుబడి