Telugu Global
NEWS

ఇండియాకు భారీగా వస్తున్న రష్యన్ ఆయిల్.. వారం క్రితమే సముద్రమార్గంలో బయలుదేరిన ట్యాంకర్లు

ఒపెక్ దేశమైన రష్యా నుంచి గతంలో ఎన్నడూ లేనంత పరిమాణంలో ఆయిల్ ఇండియా, చైనాలకు వస్తున్నది. ఉక్రెయిన్‌తో వార్ ప్రారంభమైన తర్వాత యూరోపియన్ దేశాలు రష్యా నుంచి ఆయిల్, గ్యాస్, బొగ్గు కొనుగోలును తగ్గించాయి. దీంతో అత్యధికంగా ఉత్పత్తి అవుతున్న ఆయిల్ ఎవరికి సరఫరా చేయాలో తెలియక రష్యన్ కంపెనీలూ తలపట్టుకున్నాయి. అదే సమయంలో రష్యా ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. తమ వద్ద ఆయిల్‌ను ఒపెక్ దేశాల రేటు కంటే తక్కువకే ఇస్తామని చెప్పింది. రష్యా […]

ఇండియాకు భారీగా వస్తున్న రష్యన్ ఆయిల్.. వారం క్రితమే సముద్రమార్గంలో బయలుదేరిన ట్యాంకర్లు
X

ఒపెక్ దేశమైన రష్యా నుంచి గతంలో ఎన్నడూ లేనంత పరిమాణంలో ఆయిల్ ఇండియా, చైనాలకు వస్తున్నది. ఉక్రెయిన్‌తో వార్ ప్రారంభమైన తర్వాత యూరోపియన్ దేశాలు రష్యా నుంచి ఆయిల్, గ్యాస్, బొగ్గు కొనుగోలును తగ్గించాయి. దీంతో అత్యధికంగా ఉత్పత్తి అవుతున్న ఆయిల్ ఎవరికి సరఫరా చేయాలో తెలియక రష్యన్ కంపెనీలూ తలపట్టుకున్నాయి. అదే సమయంలో రష్యా ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. తమ వద్ద ఆయిల్‌ను ఒపెక్ దేశాల రేటు కంటే తక్కువకే ఇస్తామని చెప్పింది.

రష్యా ఆఫర్‌కు ఇండియా, చైనాలు ఓకే చెప్పాయి. దీంతో దాదాపు 74 మిలియన్ నుంచి 79 మిలియన్ బ్యారెళ్ల ఆయిల్ రష్యా నుంచి బయలుదేరింది. సముద్ర రవాణాలో ఉన్న క్రూడ్ ఆయిల్‌ను ఫ్లోటింగ్ ఆయిల్ అని అంటారు. అంటే అది మార్గమధ్యంలో ఉన్నట్లు లెక్క. ఈ ఫ్లోటింగ్ ఆయిల్ ఈ ఏడాది ఫిబ్రవరిలో 27 మిలియన్ బ్యారెల్స్‌గా ఉంది. కానీ మే నెలకు వచ్చే సరికి ఏకంగా ఇది 79 మిలియన్ బ్యారల్స్‌కు పెరిగింది. ఇందుకు ప్రధాన కారణం రష్యా నుంచి ఇండియా, చైనాకు క్రూడ్ ఆయిల్ రవాణా అవుతుండటమే అని కెప్లర్ అనే సంస్థ తెలిపింది. రష్యా నుంచి గతంలో యూరోపియన్ కంట్రీస్ ఎక్కువగా క్రూడ్ ఆయిల్, నాచురల్ గ్యాస్‌పై ఆధారపడేవి. ఆయా దేశాలకు పైప్ లైన్ల ద్వారా రష్యా వీటిని సరఫరా చేసేది. దీంతో ఫ్లోటింగ్ ఆయిల్ తక్కువగా ఉండేది.

కానీ, రష్యా నుంచి ఇండియా, చైనాలకు నేరుగా పైప్ లైన్లు లేకపోవడంతో ఓడల ద్వారా రవాణా చేస్తున్నారు. భారీ డిస్కౌంట్ రేటుకు క్రూడ్ ఆయిల్ వస్తుండటంతో ఇండియన్ ఆయిల్ కంపెనీలు కొనుగోలు చేశాయి. ఉక్రెయిన్ యుద్దం నేపథ్యంలో రష్యాపై యూఎస్. యూరోపిన్ దేశాలు ఆంక్షలు విధించాయి. అయితే ఇండియా, చైనా మాత్రం పొలిటికల్ స్టాండ్ తీసుకోకుండా.. కేవలం ఆర్థికపరమైన కోణంలోనే ఆయిల్ కొనుగోలు చేస్తున్నట్లు సింగపూర్‌కు చెందిన కెప్లర్ కంపెనీ సీనియర్ ఆయిల్ అనలిస్టు జేన్ జీ చెప్పారు. ఇండియాకు ఈ ఆయిల్ త్వరగానే చేరుకుంటుందని.. కానీ చైనాకు చేరుకోవడానికి మాత్రం రెండు నెలల సమయం పడుతుందని నిపుణులు చెప్తున్నారు.

First Published:  27 May 2022 1:21 PM IST
Next Story