Telugu Global
NEWS

ఇదెక్కడి పీహెచ్‌డీ బాబోయ్..

శ్లోకం చదివి చర్మవ్యాధులను నయం చేయవచ్చని పరిశోధన చేసి పీహెచ్‌డీ పొందిన మహిళ ఏదైనా ఒక సబ్జెక్టులో అత్యున్నత పరిశోధన చేసినందుకు డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పీహెచ్‌డీ)ని ప్రదానం చేస్తారు. మ్యాథ్స్, సైన్స్, సోషియాలజీ, పొలిటికల్ సైన్స్‌తో సహా.. మరెన్నో సబ్జెక్టులలో ఇలాంటి పరిశోదనలు చేసి డాక్టరేట్ పట్టాలు పొందిన వాళ్లు ఉన్నారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే పట్టా గురించి వింటే మాత్రం మీరు ఆశ్చర్యపోవడం ఖాయం. ఇలా కూడా పట్టాలు ఇస్తారా అని డౌట్ […]

ఇదెక్కడి పీహెచ్‌డీ బాబోయ్..
X

శ్లోకం చదివి చర్మవ్యాధులను నయం చేయవచ్చని పరిశోధన చేసి పీహెచ్‌డీ పొందిన మహిళ

ఏదైనా ఒక సబ్జెక్టులో అత్యున్నత పరిశోధన చేసినందుకు డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పీహెచ్‌డీ)ని ప్రదానం చేస్తారు. మ్యాథ్స్, సైన్స్, సోషియాలజీ, పొలిటికల్ సైన్స్‌తో సహా.. మరెన్నో సబ్జెక్టులలో ఇలాంటి పరిశోదనలు చేసి డాక్టరేట్ పట్టాలు పొందిన వాళ్లు ఉన్నారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే పట్టా గురించి వింటే మాత్రం మీరు ఆశ్చర్యపోవడం ఖాయం. ఇలా కూడా పట్టాలు ఇస్తారా అని డౌట్ వస్తుంది.

ఆ మధ్య కొన్ని యూనివర్సిటీలలో జ్యోతిష్యం, వాస్తుకు సంబంధించిన కోర్సులు ప్రవేశపెట్టారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన తెలుగు యూనివర్సిటీలో కూడా ఇలాంటి కోర్సులు మొదలుపెట్టి అనేక విమర్శలు మూటగట్టుకున్నది. తాజాగా జోరాస్ట్రియన్ కాలేజ్ ఆఫ్ ముంబై ఒక మహిళకు చర్మవ్యాధులకు సంబంధించిన పరిశోధనపై పీహెచ్‌డీ పట్టా ఇచ్చింది.

చర్మవ్యాధులపై పరిశోధన చేస్తే పీహెచ్‌డీ ఇవ్వడంలో తప్పేముందని మీకు డౌటనుమానం రావొచ్చు. పూర్తిగా చదవండి.. జైనులకు సంబంధించిన ‘భక్తమార్ శ్లోక’ను చదవడం ద్వారా చర్మ వ్యాధులు ఉన్న వారికి నయం అవుతుందని జరిపిన పరిశోధనకు గాను ఈ డాక్టరేట్ అందించినట్లు పేర్కొన్నారు. స్వప్న జైన్ అనే మహిళ డాక్టర్ మంజు సందీప్ జైన్, డాక్టర్ అర్చన వినయ్ జైన్ పర్యవేక్షణలో జరిపిన పరిశోధన సఫలం కావడంతోనే ఈ డాక్టరేట్ అందిస్తున్నట్లు చెప్తున్నారు. సదరు స్వప్న జైన్ భోపాల్‌లో ఒక హీలింగ్ సెంటర్‌కు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నది. ఆమె ముంబై కాలేజీలో చేసిన పరిశోధనకు గాను ఈ పీహెచ్‌డీ ప్రదానం చేశారు.

అయితే ఒక శ్లోకం చదవడం ద్వారా చర్మ వ్యాధులు ఎలా నయమవుతాయని? ఎన్నో ఏండ్లు డాక్టర్ విద్యను అభ్యసించి చర్మ వ్యాధుల డాక్టర్లుగా ప్రాక్టీస్ చేస్తున్న వాళ్లే.. కొన్ని వ్యాధులను నయం చేయలేకపోతుంటే.. ఒక శ్లోకం వ్యాధిని నయం చేస్తుందని నమ్మి ఆ కాలేజీ ఎలా సర్టిఫికేట్ ఇచ్చిందని పలువురు ప్రశ్నిస్తున్నారు.

First Published:  27 May 2022 9:25 AM IST
Next Story