షారుక్ ఖాన్ కొడుకు నెల రోజులు జైల్లో అన్యాయంగా ఉన్నట్టే... క్లీన్ చిట్ ఇచ్చిన దర్యాప్తు సంస్థ
బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను ఓ డ్రగ్స్ కేసులో జైల్లో పెట్టిన సంగతి తెలిసిందే. కార్డీలియా క్రూయిజ్ కేసులో అతడిని అరెస్టు చేసి నెల రోజుల పాటు జైల్లో ఉంచారు. ఆర్యన్ దగ్గర డ్రగ్స్ లభించాయని మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ, తాజాగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కోర్టులో దాఖలు చేసిన చార్జ్ షీట్‌లో ఆర్యన్ ఖాన్ పేరు లేకపోవడం గమనార్హం. నిరుడు అక్టోబర్ నెలలో ఆర్యన్ తన స్నేహితులతో కలసి ఒక […]
బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను ఓ డ్రగ్స్ కేసులో జైల్లో పెట్టిన సంగతి తెలిసిందే. కార్డీలియా క్రూయిజ్ కేసులో అతడిని అరెస్టు చేసి నెల రోజుల పాటు జైల్లో ఉంచారు. ఆర్యన్ దగ్గర డ్రగ్స్ లభించాయని మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ, తాజాగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కోర్టులో దాఖలు చేసిన చార్జ్ షీట్‌లో ఆర్యన్ ఖాన్ పేరు లేకపోవడం గమనార్హం.
నిరుడు అక్టోబర్ నెలలో ఆర్యన్ తన స్నేహితులతో కలసి ఒక క్రూయిజ్ షిప్‌లో విహారయాత్రకు వెళ్లాడు. ఆ షిప్‌లో ఉన్న పర్యాటకులు డ్రగ్స్ వాడుతున్నారనే సమాచారంతో ముంబై పోలీసులు రెయిడ్ చేశాడు. ఆ సమయంలో షిప్‌లో ఉన్న ఆర్యన్‌ను అరెస్టు చేశాడు. 26 రోజుల పాటు కస్టడీలో ఉన్న ఆర్యన్‌కు అక్టోబర్ 28న బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో అతడు అక్టోబర్ 30న జైలు నుంచి విడుదల అయ్యాడు. తాజాగా నమోదు చేసిన చార్జ్ షీట్‌లో ఆర్యన్ పేరు లేకపోవడంతో అన్యాయంగా నెల రోజులు జైల్లో ఉన్నట్లే అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ కేసుకు సంబంధించిన చార్జ్‌షీట్‌లో ఆర్యన్ డ్రగ్స్ వాడినట్లు గానీ, డ్రగ్స్ ముఠాతో లింకులు ఉన్నట్లుగానీ పేర్కొనలేదు. అసలు ఆర్యన్ పేరును ఎక్కడా నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో ప్రస్తావించకపోవడం గమనార్హం.